కోడి గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. అయితే కోడి గుడ్డుతో గుండెపోటుకు చెక్ పెట్టవచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి.
వారానికి ఒకటి నుంచి మూడు కోడి గుడ్లు తినడం వల్ల గుండె సంబంధిత జబ్బులు సగానికి తగ్గుతాయని రీసెంట్ గా చేసిన అధ్యయనంలో తేలింది.
వారంలో 4 నుంచి 7 గుడ్లు తినే వారిలో 75 శాతం మందికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని స్టడీ వెల్లడించింది.
వారానికి ఒకటి నుంచి 3 గుడ్లు తినేవారు ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనం వెల్లడించింది.
గుడ్లు తినడం వల్ల గుండె పనితీరు మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.
గుడ్లలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. మినరల్స్, విటమిన్ బీ2, బీ12, ఐరన్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి.
ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. కోడిగుడ్డు వల్ల శరీరంలో కొవ్వు పెరగదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
కోడి గుడ్డు తీసుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. శరీర బరువుకు కోడి గుడ్డు సహకరిస్తుంది. మెదడు పనితీరు కూడా మెరుగుపరుస్తుందని స్టడీస్ చెబుతున్నాయి.
గుడ్డులో ఉండే పచ్చ సొన తినడం వల్ల మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను నయం చేయవచ్చునని చెబుతున్నారు.
వారంలో మూడు గుడ్డు సొనలు తినడం వల్ల మధుమేహం, గుండె వ్యాధులను కట్టడి చేయవచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వారంలో 3 సొనలు తినవచ్చునని 2018లో సూచించింది.
గుడ్డు సొన తినడం వల్ల విటమిన్ డి, ఐరన్ లభిస్తాయని స్టడీస్ లో తేలింది.
రోజుకు 2 నుంచి 4 గుడ్లలోని తెల్ల సొనను తింటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రోజుకు ఒకటి నుంచి 2 గుడ్ల తెల్ల సొన తీసుకోవాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొంది.
గమనిక: ఇది అంతర్జాలంలో సేకరించిన సమాచారం మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.