వంటలో ఉప్పు ఎక్కువయ్యిందా.. టెన్షన్ పడకండి.. ఈ టిప్స్ ఫాలో అయితే సరి!
ఎంత ఖరీదైన మసాలాలు వేసి.. ఎంతో శ్రద్ధగా వంట చేసినా సరే.. చిటికెడు ఉప్పు తగలకపోతే.. ఆ వంటకు రుచి రాదు.
మనం తీసుకునే ఆహారం రుచిని పెంచే విషయంలో ఉప్పు ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
అయితే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉంటే ఏం కాదు.. కావాలనుకుంటే.. కలుపుకోవచ్చు. సరిపోతుంది కానీ.. ఎక్కువైతే ఇక బీపీలే వస్తాయి చాలా మందికి.
ఆహారంలో ఉప్పు ఎక్కువ అయినప్పుడు ఏం చేయాలో తెలియక చాలా మంది మరి కాస్త కారం కలపడం.. నీళ్లు పోయడం వంటివి చేస్తారు.
కానీ అలా చేయడం వల్ల కూర రుచి మారుతుంది. పెద్దగా ప్రయోజనం ఉండదు.
కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు.. టెన్షన్ పడకుండా ఈ టిప్స్ ఫాలో అయితే.. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.
ఆహారంలో ఉప్పు ఎక్కువయితే.. బంగాళదుంపలతో సెట్ చేయవచ్చు.
బంగాళదుంప తొక్క తీసి.. కడిగి.. కట్ చేసి.. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారంలో వేయాలి.
ఆ తర్వాత 20 నిమిషాల పాటు దాన్ని కదపకుండా ఉంచాలి. అప్పుడు ఉప్పు ప్రభావం తగ్గుతుంది.
అలానే కూరలో ఉప్పు ఎక్కువైతే.. తగ్గించడం కోసం తాజా మీగడను కూడా వాడుకోవచ్చు.
ఇలా చేయడం వల్ల.. ఉప్పు తగ్గడమే కాకక.. కూర రుచి కూడా పెరుగుతుంది.
అలానే పప్పు, కూరల్లో ఉప్పు ఎక్కవైతే.. ఉడికించిన బంగాళదుంపలను వినియోగించవచ్చు.
దీని కోసం 2,3 బంగాళదుంపలను ఉడికించి.. కూరలో కలపాలి. అవి ఎక్కువైన ఉప్పును గ్రమించుకుంటాయి.
కూరలో ఉప్పు ఎక్కువైతే.. దానికి 1 టేబుల్ స్పూన్ పెరుగు కలిపి.. 5 నిమిషాలు ఉడికిస్తే సరి.
ఇక ఇండియన్, మొఘలాయి, చైనీస్ వంటకాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటే.. నిమ్మరసం కలిపితే సరి.
కూరలో ఉప్పు తగ్గించడానికి బ్రెడ్ కూడా వాడవచ్చు. దీని కోసం ఉప్పు ఎక్కువైన కూరలో.. బ్రెడ్ ముక్కలు వేసి.. 2 నిమిషాలు ఉంచితే సరి.