7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పాసైన వారికి శుభవార్త.
ఈ నెల 25న రాష్ట్రంలో మెగా జాబ్ మేళా జరగనుంది.
జాబ్ మేళాలో 72 కంపెనీలు పాల్గొంటున్నాయి.
దాదాపు 10 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు.
7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్, ఐటీఐ, డిప్లోమా, బీ.ఫార్మా/ఎం. ఫార్మా, హోటల్ మేనేజ్మెంట్, బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసిఎస్ తదితర చదువులు చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
ఐటీ, మెడికల్, ఈకామర్స్, మార్కెటింగ్, మేనేజ్మెంట్, హోటల్స్, పరిశ్రమలు, బీపీఓ, డేటా ఎంట్రీ, నర్సింగ్, ఫార్మా సహా అనేక ఇతర రంగాలకు సంబంధించి ఉద్యోగాలు ఇవ్వనున్నారు.
కోదాడలోని పెరిక్ భవన్ లో ఫిబ్రవరి 25న శనివారం ఉదయం 10 గంటలకు ఈ మెగా జాబ్ మేళా ప్రారంభం కానుంది.
ఈ జాబ్ మేళాలో పాల్గొనాలంటే నిరుద్యోగులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు కనీసం 18 ఏళ్ళు ఉండాలి. 35 ఏళ్ళు పైబడిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
మూగ, చెవిటి, దివ్యాంగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
ఎంపికైన అభ్యర్థులకు 15 వేల నుంచి లక్ష వరకూ జీతం ఉంటుంది.