అగ్నిపథ్ పథకం కింద అగ్నివీరులను నియామకం కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది.
సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ తెలంగాణలోని 33 జిల్లాల్లో నియామకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది.
అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్ నియామకాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.
అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్టుకి దరఖాస్తు చేసేవారికి పదవ తరగతిలో 45 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఒక్కో సబ్జెక్ట్ లో కనీసం 33 శాతం మార్కులు సాధించి ఉండాలి.
అగ్నివీర్ టెక్నికల్ పోస్టుకి ఇంటర్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. కనీసం 50 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఒక్కో సబ్జెక్ట్ లో కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
లేదా పదో తరగతి పాసై.. రెండేళ్ల ఐటీఐ గానీ మూడేళ్ళ డిప్లోమా గానీ చేసి ఉండాలి.
అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టుకి 60 శాతం ఉత్తీర్ణతతో ఇంటర్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఒక్కో సబ్జెక్ట్ లో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్ పోస్టుకు 8వ తరగతి గానీ 10వ తరగతి పాసైతే చాలు. కానీ ఒక్కో సబ్జెక్ట్ లో కనీసం 33 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
వయసు పరిమితి: 17.5 ఏళ్ల నుంచి 21 సంవత్సరాల లోపు ఉండాలి.
అభ్యర్థులకు పెళ్లి అయి ఉండకూడదు.
ఎంపిక విధానం: ఆన్ లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, భౌతిక పరీక్షలు ఉంటాయి.
ఆన్ లైన్ రాత పరీక్ష తేదీ: 17/04/2023
దరఖాస్తు ప్రక్రియ ఆన్ లైన్ లో చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ: 16/02/2023 దరఖాస్తు చివరి తేదీ: 15/03/2023