మారుతున్న కాలాన్ని బట్టి.. మనిషి ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి.
ఇలా ఎప్పటికప్పుడు ఆహారపు, జీవిత విధానాలు మారడంతో మానవుడు రోగాలతో సహజీవనం చేస్తున్నాడు.
మనిషి ఆరోగ్యంలో ముఖ్య పాత్ర పోషించేవి మనం తినే ఆహారపదార్థాలే. అందులో ప్రధానమైనవి కూరగాయలు.
ఇక కూరగాయల్లో మనకు విరివిరిగా మార్కెట్ లో దొరికేది బంగాళదుంపలు. దాంతో అవే ఎక్కువ తినడానికి జనాలు ఆసక్తి చూపుతారు.
బంగాళదుంపలు తినడం ద్వారా శరీరానికి పిండి పదార్థం లభిస్తుంది. దీని కారణంగా బాడీకి శక్తి చేకూరుతుంది.
అయితే అతిగా బంగాళదుంపలు తింటే మాత్రం అనారోగ్యం పాలవడం ఖాయం అంటున్నారు వైద్యులు.
బంగాళాదుంపల్లో ఉండే పిండిపదార్థం అర్థరైటిస్ నొప్పిని పెంచుతుందట.
అదీకాక వీటిని అతిగా తినడం వల్ల రక్తంలో చెక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు.
అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
వీటిని ఎక్కువగా తినడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు చేరుకుంటుంది అంటున్నారు వైద్యులు.
అందుకే బరువు తగ్గాలి అనుకున్న వారు ఈ కూరగాయలను ఆహారంలో చేర్చుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.
నోట్: ఈ చిట్కాలను పాటించే ముందు మీ దగ్గర్లో ఉన్న డాక్టర్ల, నిపుణుల సలహాలు తీసుకోండి.