బార్లీ నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. బార్లీ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి శరీరంలో ఉండే గ్లూకోజ్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. 

బార్లీ నీరు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. అలానే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బార్లీలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు రావు.

బార్లీ నీటిని తరచూ తాగడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. 

దీని వల్ల ఆకలి సమస్య ఉండదు. అందువల్ల బరువు పెరిగే అవకాశం తక్కువ ఉంటుంది.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే బార్లీ నీరు తగ్గిస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

బార్లీ నీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు ఫ్రీ రాడికల్స్ తో పోరాడే రోగనిరోధక శక్తిని శరీరానికి అందిస్తాయి.

బార్లీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఆక్సీకరణ, ఫ్రీ రాడికల్స్ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్యలను తగ్గించడానికి బార్లీ నీరు బాగా పని చేస్తుంది. బార్లీ నీరు శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా ఉంచుతుంది.

బార్లీ నీరు తాగడం వల్ల మూత్ర విసర్జన బాగా అవుతుంది. దీని వల్ల శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటకు పోతాయి.

బార్లీ నీటిని తయారు చేసుకోవడానికి అరకప్పు బార్లీ, ఒక టీ స్పూన్ నల్ల మిరియాలు, 2 యాలకులు, ఒక టీ స్పూన్ సోంపు గింజలు, ఒక స్పూన్ జీలకర్ర, పసుపు కావాలి.

2 గంటల పాటు బార్లీని నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో 2 గ్లాసుల నీరు వేసి పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో మరగబెట్టాలి.

ఆ గిన్నెలో నానబెట్టిన బార్లీ వేయాలి. ఆ తర్వాత మిరియాలు, యాలకులు, సోంపు, జీలకర్ర వేయాలి.

7 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించి.. ఆ నీటిని వడకట్టి గ్లాస్ లో పోసుకోవాలి.

ఆ బార్లీ నీటిలో నిమ్మరసం కలిపి తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఉదయం పరగడుపున బార్లీ నీరు తాగితే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.