ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎడ్) లో 451 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పడింది.

కానిస్టేబుల్ లేదా డ్రైవర్, కానిస్టేబుల్ లేదా డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అభ్యర్థులను ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 451 కానిస్టేబుల్/డ్రైవర్ - డైరెక్ట్: 183 కానిస్టేబుల్/(డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్): 268

కేటగిరీల వారీగా ఖాళీలు: యూఆర్: 187 ఎస్సీ: 67 ఎస్టీ: 32 ఓబీసీ: 121 ఈడబ్ల్యూఎస్: 44

జీతం: నెలకు రూ. 21,700/- నుంచి రూ. 69,100/- వరకూ

వయసు పరిమితి: 22/02/2023 నాటికి 21 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి.

వయసు సడలింపు: ఉంది

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఇతర అర్హతలు: హెవీ మోటార్ వెహికల్ లేదా ట్రాన్స్ పోర్ట్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్, మోటార్ సైకిల్ విత్ గేర్ లైసెన్స్ కలిగి ఉండాలి. 

అనుభవం: 3 ఏళ్ళ పాటు హెవీ వెహికల్, ట్రాన్స్ పోర్ట్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్, మోటార్ సైకిళ్లను నడిపిన అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: హైట్ బార్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రిటన్ టెస్ట్ పాసైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో చేసుకోవాలి. 

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో చేసుకోవాలి. దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్ మ్యాన్ లకు: రూ. 0/- ఇతర అభ్యర్థులకు: రూ. 100/-

దరఖాస్తు చివరి తేదీ: 22/02/2023 రాత్రి 11 గంటల వరకూ