టాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్న హీరో సుధీర్ బాబు..
ప్రేమకథాచిత్రమ్, భలే మంచి రోజు, సమ్మోహనం, నన్నుదోచుకుందువటే లాంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
గతేడాది 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాతో సుధీర్.. ఇప్పుడు ‘హంట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి హంట్ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
కథ: అసిస్టెంట్ కమీషనర్ ఆర్యన్ దేవ్(ప్రేమిస్తే భరత్) హత్యకు గురవ్వడంతో ఆ కేసును సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ ప్రసాద్(సుధీర్ బాబు)కి అప్పగిస్తారు.
కేసు ఇన్వెస్టిగేషన్ టైంలో ఓ ప్రమాదం జరిగి.. అర్జున్ తన గతాన్ని మర్చిపోతాడు.
మరి మెమోరీ లాస్ అయిన అర్జున్ కేసును ఎలా సాల్వ్ చేశాడు? ఆర్యన్ దేవ్ ని హత్య చేసింది ఎవరు? ఈ కేసులో అర్జున్ ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనేది సినిమాలో చూడాల్సిందే.
విశ్లేషణ: పోలీస్ కథలతో వచ్చే యాక్షన్ సినిమాలపై జనాలకు ఎప్పుడైనా ఆసక్తి ఉంటుంది. ఏదొక కేసు గురించి లేదా సీరియస్ ఇష్యూ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇంటరెస్టింగ్ గా సాగుతుంటాయి.
అందుకే కాప్ స్టోరీస్ కి ఉండే క్రేజ్ అలాగే ఉంటుంది. అయితే.. సుధీర్ బాబు ఈ ‘హంట్’ సినిమా ఒప్పుకోవడమే పెద్ద సవాల్ అని చెప్పాలి.
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందించినా, ప్రేక్షకులకు ఈ సినిమా ఓ జెన్యూన్ అటెంప్ట్ లా అనిపిస్తుంది. కొన్నిసార్లు పోలీస్ కథలలో కూడా హీరోయిన్స్ ని పెట్టేసి.. గ్లామర్ వైపు ట్రై చేస్తుంటారు.
ఈ సినిమాలో హీరోయిన్ ఉండదు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ ప్రసాద్ పోరాటం మాత్రమే తెరపై ప్రెజెంట్ చేశారు. ఇందులో హీరోకి యాక్సిడెంట్.. మెమోరీ లాస్ మెయిన్ ప్లస్.
మెమోరీ లాస్ అయ్యాక ఓ పోలీస్ ఎలా కేసు సాల్వ్ చేస్తాడనేది కొత్త పాయింట్. తెలుగులో ఇప్పటిదాకా ఇలాంటి పాయింట్ తో సినిమా రాలేదు. కానీ.. ఇదే స్టోరీ లైన్ తో 2013లో ‘ముంబై పోలీస్'(2013) అనే మలయాళం మూవీ రిలీజ్ అయ్యింది.
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆ 'ముంబై పోలీస్' సినిమానే హంట్ గా రీమేక్ చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. స్టోరీ లైన్ ఒక్కటే గానీ, స్క్రీన్ ప్లే ట్రీట్ మెంట్ మార్చారు.
ట్రైలర్ చూపించిన అంశాలతో పాటు సినిమాలో వేరే ట్విస్టులు ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత అసలు కథ మొదలవుతుంది. సెకండాఫ్ లో మెమోరీ లాస్ అయిన అర్జున్.. కేస్ ని ఎలా సాల్వ్ చేశాడనేది ఆసక్తికరంగా ఉంటుంది.
ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నా.. స్క్రీన్ ప్లేని బిగువుగా రాసుకోవడంలో దర్శకుడు తడబడ్డాడు. ఇక సుధీర్ బాబు తన 100% ఎఫర్ట్స్ పెట్టేశాడు.
'ప్రేమిస్తే' భరత్, శ్రీకాంత్, మౌనిక రెడ్డి తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ అరుళ్ విన్సెన్ట్ వర్క్ ఓకే. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి అవసరమైన మేర ఉంది. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఇక దర్శకుడు మహేష్ సూరపనేని.. స్క్రీన్ ప్లేని మరింత గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటే బాగుండేది. కానీ.. అతని ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి.
ప్లస్ లు: సుధీర్ బాబు స్టోరీ లైన్ యాక్షన్ సీక్వెన్స్ లు జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ లు: స్లో నెరేషన్ గ్రిప్ మిస్సయిన స్క్రీన్ ప్లే పూర్తిగా సీరియస్ గా సాగడం
చివరిమాట: హంట్.. తడబడింది!