క్రికెట్ లో గాడ్ అనగానే సచినే గుర్తొస్తారు. అంతలా ఈ గేమ్ లో తన మార్క్ క్రియేట్ చేశారు.
టీనేజ్ లోనే టీమిండియాలోకి వచ్చిన సచిన్.. దాదాపు 25 ఏళ్లపాటు పలు స్థానాల్లో ఆడారు.
మిగతా విషయాల్లో ఏమో గానీ బ్యాటర్ గా మాత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు.
ఇక సచిన్.. అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు చేశారు. ఈ రికార్డుని ఇప్పట్లో బ్రేక్ చేయడం కష్టమే!
అయితే 90 పరుగుల దగ్గర కూడా సచిన్ చాలాసార్లే ఔటయ్యాడు. ఈ విషయం మనలో చాలామందికి తెలుసు.
ఒకవేళ వాటిని కూడా శతకాలుగా మార్చుకుని ఉంటే.. మరో 20-30 సెంచరీలు సచిన్ ఖాతాలో యాడ్ అయ్యేవి.
ఏళ్లపాటు జట్టులో ఉన్న సచిన్.. ప్రతి క్రికెటర్ తో ఎంతో మంచిగా ఉండేవారు. సూపర్ బాండింగ్ ని మెంటైన్ చేసేవారు.
అలాంటిది సచిన్ కు తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ సారీ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో టీ20 లీగ్ జరుగుతోంది. ఇందులో ఓ మ్యాచ్ సందర్భంగా ఓ వింత రనౌట్ చోటు చేసుకుంది.
ఇక క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కామెంటేటర్ గా మారిన ఆర్పీ సింగ్.. ఈ రనౌట్ చెబుతూ గతంలోని ఓ విషయాన్ని ప్రస్తావించాడు.
2006 వెస్టిండీస్ తో జరిగిన ఓ వన్డేలో నాన్ స్ట్రెయికర్ ఎండ్ లో ఉన్న సచిన్ ని ఆర్పీ సింగ్ ఇలానే ఔట్ చేశాడు.
ఇక ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెప్పాలంటే ఎక్కువగానే రన్స్ చేయాలి.
భారత జట్టులో మిగతా బ్యాటర్లందరూ ఔటైపోయినప్పటికీ.. సచిన్ మాత్రం స్టాండింగ్ ఇచ్చాడు. కానీ ఆర్పీ సింగ్ చేసిన తప్పిదం సచిన్ ని ఔట్ చేసింది.
శ్యామ్యూల్స్ వేసిన బంతిని ఆర్పీ సింగ్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడటంతో.. బౌలర్ చేతిని తాకి అది వికెట్లను పడగొట్టింది. అదే టైంకి సచిన్ క్రీజు బయట ఉన్నాడు.
అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ని తాజాగా గుర్తుచేసుకున్న ఆర్పీ సింగ్.. 'సచిన్ పాజీకి సారీ చెబుతున్నా.. ఆ రోజు స్ట్రెయిట్ డ్రైవ్ ఆడకుండా ఉండాల్సింది' అని చెప్పుకొచ్చాడు.
ఇక ఆర్పీ సింగ్ కామెంటరీలో ఇది చెబుతున్న వీడియోని పోస్ట్ చేసిన మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. 'మరోసారి సారీ.. సచిన్ పాజీ' అని క్యాప్షన్ తో పోస్ట్ చేశాడు.