ప్రస్తుతం సోషల్ మీడియా హవా పెరిగిన తర్వాత.. సెలబ్రిటీలకు చెందిన చిన్నప్పటి ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది ఏ సినిమా సెలబ్రిటీనో, క్రికెటర్ గురించో కాదు.. రియల్ లైఫ్ స్టార్ గురించి.
పైన ఉన్న ఫొటోలోని వ్యక్తి ప్రస్తుతం ఓ పెద్ద స్టేట్‌కి చాలా పవర్ ఫుల్ సీఎం.
సినిమా తారలు, క్రీడాకారులకు అభిమానులు ఎలా ఉంటారో.. ఈ సీఎంకి అంతకంటే ఎక్కువ మందే ఫ్యాన్స్ ఉన్నారు.
ఆయన సంక్షేమ పథకాలు, నిర్ణయాలు, మహిళల రక్షణ విషయంలో తీసుకునే కఠిన చర్యలతో ఎంతో మంది ఫ్యాన్స్ అయ్యారు.
ఆయన మరెవరో కాదు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.
ఆయన 1972 జూన్ 5న ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ఉన్న పౌరీ గర్వాల్ జిల్లా, పాంచుర్ లో జన్మించారు.
ఉత్తరాఖండ్ లోని శ్రీనగర్ హెచ్ఎన్ బీ గర్ వాల్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పట్టా పొందారు.
తర్వాత సన్యాసం వైపు ఆకర్షితులయ్యి కాషాయం ధరించారు.
గోరఖ్ నాథ్ మఠాధిపతి ఆదిత్యానాథ్ అస్తమయం తర్వాత ఆయన వారసుడిగా మఠం బాధ్యతలు స్వీకరించారు.
కటిక నేలపై నిద్రించడం, ఏ రుతువులోనైనా ఒకటే తరహా వస్త్రాలు ధరిస్తారు.
సన్యాసం స్వీకరించిన కరాణంగా ఆయన తండ్రి కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోయారు.
ఆయన సోదరుడు భారత సైన్యంలో సేవలందిస్తున్నారు. సోదరి- బావగారు చాయ్ దుకాణం నడిపిస్తుంటారు.
1998లో గోరఖ్ పూర్ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పుడు పార్లమెంట్ లో ఆయనే అతి పిన్న వయస్కుడు.
2017లో తొలిసారి సీఎం అయిన ఆయన.. 2022 మార్చిలో రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి చరిత్ర సృష్టించారు.