పూర్వం మన పెద్దలు పశువులను కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించే వారు.

తాము నివాసం ఉంటున్న ప్రాంతంలోనే గోవులను సైతం కట్టేసుకునే వారు. 

వాటికి మంచి ఆహారం అందిస్తూ సొంత బిడ్డలతో సమానంగా చూసుకునే వారు.

అంతేకాక అప్పట్లో జరిగే కొన్ని పెళ్లిళ్లలో గోవులు సందడి కూడా ఉండేది. 

అయితే నేటికాలంలో పశువుల పట్ల , ముఖ్యంగా గోవులపై నిర్లక్ష్య ధోరణి బాగా పెరిగిపోయింది. 

గోవులపై నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ యువ జంట వినుత్నగా వివాహం చేసుకున్నారు.

మన పూర్వపు ఆచారాలను గుర్తుచేయాలనే  ఉద్దేశంతో గోమాత సమక్షంలో తమ పెళ్లి చేసుకున్నారు.

మధ్యప్రదేశ్ చెందిన రంజన శర్మ అనే యువతికి  యతేంద్ర శర్మతో  పెళ్లి నిశ్చయమైంది.

రంజనకు చిన్నతనం నుంచి గోవులు అంటే చాలా ఇష్టం. 

నేటికాలంలో గోవుల పట్ల పెరుగుతున్న నిర్లక్ష్య ధోరణి రంజనను బాగా కలచివేసింది.

సనాతన ఆచారాలను ప్రజలకు గుర్తు చేయాలని తన పెళ్లి గోమాత సమక్షంలో జరుపుకోవాలని భావించింది. 

ఇదే విషయాన్ని వరుడు కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు కూడా సంతోషంగా అంగీకరించారు. 

పెళ్లి రోజున మొదట వధూవరులు ఓ గోవుకు ప్రత్యేక పూజాలు నిర్వహించారు. 

అలానే గోమాత సమక్షంలోనే  వేదమంత్రాల సాక్షిగా ఆ యువజంట వివాహం జరిగింది.

గోవుల ప్రాముఖ్యతను తెలుపుతూ ఈ నూతన జంట చేసిన పనికి అందరూ అభినందించారు.