తెలుగు సినిమా స్థాయిని పెంచిన వ్యక్తి SS రాజమౌళి. ఎవరిని అడిగినా సరే ఇది కచ్చితంగా ఒప్పుకొంటారు.

తీసిన ప్రతి సినిమాతోనూ హిట్ కొట్టిన రాజమౌళి.. టాలీవుడ్ లో ఆల్రెడీ సరికొత్త రికార్డులు సృష్టించారు.

'బాహుబలి' తన గురించి వరల్డ్ వైడ్ ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేశాడు. వేల కోట్ల వసూళ్లని టాలీవుడ్ కు పరిచయం చేశాడు.

రెండు భాగాలుగా రిలీజైన ఈ మూవీ.. టాలీవుడ్ కి సరికొత్త రూట్ చూపించడంతో పాటు పాన్ ఇండియా కల్చర్ ని అలవాటు చేసింది.

ఇక రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్'.. గతేడాది మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

మన దేశ ప్రేక్షకుల్నే కాదు.. హాలీవుడ్ నటీనటులు, డైరెక్టర్స్ ని కూడా 'RRR' ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా గురించి మెచ్చుకుంటూ ట్వీట్స్ వేశారు.

బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఓవరాల్ గా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఆస్కార్ రేసులోనూ ఉంది.

దానికంటే ముందు వరసపెట్టి పురస్కారాలను ఈ సినిమా సొంతం చేసుకుంటోంది. రీసెంట్ గానే ప్రతిష్ఠాత్మక 'గోల్డెన్ గ్లోబ్' అవార్డ్ గెలుచుకోవడం దీనికి ఎగ్జాంపుల్.

ఇదంతా కాదన్నట్లు గత కొన్నాళ్ల నుంచి 'ఆర్ఆర్ఆర్' టీమ్ అంతా కూడా అమెరికాలోనే ఉంది. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర సంఘటనలు జరిగాయి.

'జురాసిక్ పార్క్' లాంటి అద్భుత చిత్రాల సృష్టికర్త స్పీల్ బర్గ్ ని కలిసిన రాజమౌళి.. తన ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. ఆ ఫొటోల్ని ఇన్ స్టాలోనూ పోస్ట్ చేశారు.

ఈయన తర్వాత 'అవతార్' చిత్రాల సృష్టికర్త, స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ని కూడా రాజమౌళి కొన్ని రోజుల ముందే కలిశారు. ఆ ఫొటోల్ని పోస్ట్ చేశారు.

అయితే వీళ్లిద్దరూ కలిసింది చూసి అందరూ తెగ ఎంజాయ్ చేశారు. కానీ వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారనేది మాత్రం తాజాగా బయటకొచ్చింది.

RRR చిత్రబృందం.. రాజమౌళి, జేమ్స్ కామెరూన్ మాట్లాడుకున్న 3 నిమిషాల వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇది ఫుల్ వైరల్ గా మారిపోయింది.

ఇక ఈ వీడియోలో భాగంగా రాజమౌళి పనితనాన్ని.. జేమ్స్ కామెరూన్ తెగ మెచ్చుకుంటూ కనిపించారు. ప్రతి సీన్ ని వివరిస్తూ చెప్పడం తెలుగు ప్రేక్షకులకు గర్వపడేలా చేసింది.

అలానే ఆయన ఏకంగా రెండుసార్లు RRR సినిమా చూశారని.. జేమ్స్ కామెరూన్ వైఫ్ రాజమౌళితో చెప్పారు. ఈ సీన్ అయితే మొత్తం వీడియోకే హైలెట్ గా నిలిచింది.

ఇక హాలీవుడ్ లో సినిమా చేసే ఆసక్తి ఉంటే చెప్పు.. కలిసి పనిచేద్దాం అని రాజమౌళితో జేమ్స్ కామెరూన్ అనడం తెలుగు ప్రేక్షకులని హైలోకి తీసుకెళ్లిపోయింది.

జక్కన్నకు హాలీవుడ్ ఆఫర్ రావడం సంగతి అటుంచితే.. ఆయన ఇప్పుడు ఒప్పుకొన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి మరో నాలుగైదేళ్లు పట్టొచ్చు.

ఒకవేళ అంతా సెట్ అయితే మాత్రం.. రాజమౌళి రేంజ్ మాత్రమే కాదు తెలుగు సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లిపోతుందనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు!