ఈ రోజుల్లో చాలా మంది టీ తాగడం అలవాటు చేసుకున్నారు.

అయితే చాలా మంది వేళా పాళ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగుతుంటారు. 

ఉదయం లేవగానే ఒకటి, మధ్యాహ్నం మరొకటి, ఇక యథావిధిగా సాయంత్రం ఇంకొకటి. ఇలా ఒక టీ ఏంటి.. రోజుకు కనీసం ఐదు, ఆరు టీలు తాగుతున్నారు.

ఇలా అధికంగా టీ తాగడం వల్ల మనకు తెలియకుండానే అనేక రకాల సమస్యలు వస్తాయని చాలా మందికి తెలియదు.

అసలు టీ తాగడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి? మరీ ముఖ్యంగ సాయంత్రం వేళ టీ తాగడం ద్వారా వచ్చే సమస్యలు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

రోజూ సాయంత్రం టీ తాగడం వల్ల అనేక సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? నిపుణులు ఎలాంటి సూచనలు చేస్తున్నారో కింద తెలుసుకోండి. 

సాయంత్రం మోతాదుకు మించి టీ తాగడం ద్వారా డీ హైడ్రేషన్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

రోజుకు నాలుగు లేదా అంతే కంటే ఎక్కువ టీ తాగే వారిలో ఐరన్ పోషణ సామర్థ్యం తగ్గుతుందట. 

ఇదే కాకుండా టీ లో ఉండే కెఫిన్ వల్ల మెదుడుపై ప్రభావం చూపుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. 

అయితే రోజూ సాయంత్రం వేళ టీ ని తక్కువ మోతాదులో తీసుకోవాలని, లేకుంటే లేని పోని అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నవారవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

మరీ ముఖ్యంగా సాయంత్రం పూట టీ అధికంగా తాగేవారు ఇలాంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.