నేటికాలంలో చాలామంది కాస్త ఎక్కువ పనిచేయగానే అలసిపోతుంటారు.
కొందరు యువతి యువకులు కూడా కాస్తా దూరం నడవగానే అలసిపోతుంటారు.
ఇలాంటి వారందరూ ఓ బామ్మను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ఆ బామ్మ 80 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారు.
ఎవరిపై ఆధారపడకుండా తనపని తానే చేసుకుంటూ పలు రకాల పరుగు పందెలా పోటీలు పాల్గొంటుంది.
ఇటీవలే జరిగిన 'టాటా ముంబాయి మారథన్' పోటీల్లో కూడా ఈ బామ్మ పాల్గొన్నారు.
అలుపు సొలుపు లేకుండా ఐదు కిలోమీటర్లు పరిగెత్తి మారథాన్ ను పూర్తి చేశారు.
ఆమే మహారాష్ట్ర కు చెందిన 80 ఏళ్ల భారతీ జితేంద్ర పాథక్ అనే బామ్మ.
చీర, స్పోర్ట్స్ షూ ధరించిన ఈ బామ్మ.. జాతీయ జెండాను చేతబట్టి మారథాన్ లో పాల్గొన్నారు.
కేవలం 51 నిమిషాల్లో సుమారు 4.2 కిలోమీటర్లు దూరం ఈ బామ్మ పరిగెత్తారు.
ఎలాంటి అలుపు లేకుండా సాగినా ఈ బామ్మ పరుగు.. ఇతర పోటీదారుల్లో స్ఫూర్తి నింపింది.
ఇంత హుషారుగా, ఆరోగ్యంగా ఉండటం వెనుక ఉన్న రహస్యం ఏమిటని కొందరు బామ్మను అడిగారు.
రోజూ ఉదయాన్నే కాసేపు నడక, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయడం తనకు అలవాటని ఆమె తెలిపారు.
ఆ వ్యాయామాలనే 80 ఏళ్ల వయసులోనూ తనను ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతున్నాయని అన్నారు.
వయస్సు మీద పడే కొద్దీ చాలా మంది కొన్ని ఆంక్షలు పెట్టుకుంటారని బామ్మ అన్నారు.
తన దృష్టిలో వయసు అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమేన్నారు ఈ బంగారు బామ్మ.