కొంతమంది పండ్ల మీద ఉప్పు, కారం చల్లుకుని తింటారు.
ముఖ్యంగా జామకాయలు మీద ఉప్పు, కారం వేసుకుని తింటారు. చాలా రుచిగా ఉంటుంది.
అయితే పండ్ల మీద ఉప్పు చల్లుకుని తింటే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పండ్లపై ఉప్పు వేసుకుని తినడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరిగి.. రక్తపోటుకు దారి తీస్తుంది.
దీని వల్ల గుండెపోటు, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఉప్పు ఎక్కువైతే మూత్రపిండాల పనితీరు దెబ్బ తింటుంది. కిడ్నీ సమస్య ఉన్నవారు పండ్లు ఎక్కువగా తింటారు.
అయితే ఈ పండ్ల మీద ఉప్పు చల్లుకుంటే సమస్య ఎక్కువవుతుందని నిపుణులు చెబుతున్నారు.
సోడియం మోతాదు ఎక్కువైతే.. శరీరంలో నీరు ఉండిపోతుంది. ఈ కారణంగా కడుపు ఉబ్బరం సమస్యతో పాటు ఇంకా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
మామూలుగా తింటే పండ్లలో ఉన్న పోషకాలు శరీరానికి అందుతాయి.
అయితే ఉప్పు చల్లుకుని తినడం వల్ల పండ్లలో ఉన్న నీరు బయటకు పోతుంది.
అలానే పోషకాలు కూడా తగ్గుతాయి. అందుకే ఉప్పు ఎక్కువగా తినకూడదని చెబుతారు.
ఉప్పు అధికంగా తింటే శరీరం పోషకాలను సరిగా గ్రహించలేదు.
రోజుకు 5 గ్రాములకు మించి ఎక్కువ మోతాదులో ఉప్పు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.