డిగ్రీ పూర్తి చేసి సరైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అవకాశం మీ కోసమే.

300 ఉద్యోగాల భర్తీకి ఎల్ఐసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది.

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.

ప్రస్తుత సంవత్సరం, బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది.

పోస్టు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

మొత్తం ఖాళీలు: 300 ప్రస్తుత సంవత్సరం: 277 బ్యాక్ లాగ్ ఖాళీలు: 23

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ లో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. 

వయసు పరిమితి: 01/01/2023 నాటికి 21 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. 

వయసు సడలింపు: కేటగిరీలను బట్టి వయసు సడలింపు ఉంది.

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుకి జీతం: రూ. 53,600/- నుంచి 1,02,090/- వరకూ

ఎంపిక ప్రక్రియ: మూడు దశల్లో ఎంపిక ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. మొదటి దశ: ప్రిలిమినరీ ఎగ్జామ్ రెండో దశ: మెయిన్ ఎగ్జామ్ మూడో దశ: ఇంటర్వ్యూ 

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ లో మాత్రమే చేసుకోవాలి.