వయసు తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ తుమ్ములు వస్తుంటాయి. 

కొందరు వచ్చిన తమ్ములను వచ్చినట్టే తుమ్ముంటే.. మరికొంతమంది మాత్రం తుమ్మకుండా ఆపుకుంటుంటారు.

తుమ్ము వచ్చినప్పుడు తుమ్మకుండా ఆపుకోవడం చాలా డేంజర్ అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

అసలు తుమ్ము వచ్చినప్పుడు తుమ్మకపోతే ఏం జరుగుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుసుకుందాం.

దుమ్ము దూలి ముక్కు ద్వారా మన లోపలికి వెళ్లడం ద్వారా సహజంగా తుమ్ములు వస్తుంటాయి.  

మనం ఆఫీసులో ఉన్నప్పుడు, బస్సులో ఉన్నప్పుడు కానీ తుమ్ము వస్తుంటే ఆపుకుంటుంటాం. 

అలా చేయడం మంచిది కాదని, పైగా ఆరోగ్యానికి చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

మనకు తుమ్ము వచ్చే ముందు ముక్కు, కళ్లు, చెవులపై పీడనం ఏర్పడుతుంది.

తుమ్మిన వెంటనే అదంత వెంటనే బయటకు వస్తుంది. ఒకవేళ తుమ్మకుండా ఆపితే మాత్రం ఏర్పడిన పీడనం అంతా బయటకు వెళ్లటానికి వీలు ఉండదు. 

తుమ్మకపోతే కనుక కళ్లు, ముక్కు, రక్తకణాలు ఉండే ప్రాంతాల్లో ఉండే కణాలు పగిలిపోయే ప్రమాదం ఉంటుంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇదే కాదండోయ్.. తుమ్ము ఆపుకుంటే ఊపిరితిత్తుల ఒత్తిడి గురవ్వడంతో పాటు అవి సరిగ్గా పని చేయకుండపోతాయి.

కర్ణభేరి కూడా దెబ్బతినడం వంటివి జరిగే ప్రమాదాలు ఉంటాయని సూచిస్తున్నారు.

మెదడు కణాలపై వాపు పెరిగి, ఒత్తిడికి పెరుగుతుంది. 

తుమ్ము వచ్చినప్పుడు తుమ్మకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలిసింది కదా.

 ఇక నుంచైనా వచ్చిన తుమ్మును తుమ్మి ఆరోగ్యం ఉండండని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.