మెగాస్టార్ చిరంజీవి, సంక్రాంతి.. నెవ్వర్ ఎండింగ్ కాంబినేషన్ మూవీ. దీనికి తోడు మాస్ మూవీ అనేసరికి అంచనాలు పెరిగిపోయాయి.

కొన్ని నెలల ముందే 'గాడ్ ఫాదర్'గా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చిన చిరు.. ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య'గా మాస్ అవతార్ లో దర్శనమిచ్చారు.

ఇక రిలీజ్ కు ముందే 'వాల్తేరు వీరయ్య' ట్రైలర్, సాంగ్స్ కూడా ఫుల్ వైరల్ గా మారిపోయాయి. దీంతో సినిమా కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేశారు.

అలా అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' ఎలా ఉంది? చిరు హిట్ కొట్టారా లేదా అనేది రివ్యూలో చూద్దాం!

కథ: జాలరిపేటలో ఐస్ ఫ్యాక్టరీ నడుపుతున్న వ్యక్తి వీరయ్య(మెగాస్టార్ చిరంజీవి) సముద్రం గురించి అన్ని తెలిసినవాడు కావడంతో నేవీ ఆఫీసర్స్ కు సాయం చేస్తుంటాడు.

మలేసియాలో డ్రగ్ మాఫియా నడుపుతున్న సాల్మన్ సీజర్ (బాబీ సింహా) వల్ల పోలీస్ ఆఫీసర్ సీతాపతి(రాజేంద్రప్రసాద్) సస్పెండ్ అవుతాడు.

ఈ క్రమంలోనే సీతాపతితో డీల్ కుదుర్చుకున్న వీరయ్య.. సాల్మన్ తోపాటు అతడి అన్న కాలా అలియాస్ మైకేల్ సీజర్(ప్రకాష్ రాజ్) కి కూడా ఎరవేస్తాడు.

మరి మైకేల్ కి వీరయ్యకి సంబంధం ఏంటి? ఈ స్టోరీలో సీన్సియర్ ఏసీపీ విక్రమ్ సాగర్ (రవితేజ) రోల్ ఏంటి? చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్లలో సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: బాస్ కంబ్యాక్ అయినా.. అన్నీ సీరియస్ సినిమాలే చేసుకుంటూ వెళ్తున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇలాంటి టైంలో వాల్తేరు వీరయ్య రిలీజైంది.

దర్శకుడు బాబీ.. మంచి ఫన్, మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ తో కూడిన వాల్తేరు వీరయ్య మూవీని తీసుకొచ్చాడు.

చిరు నుంచి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చూడాలని అనుకుంటున్న కామెడీ టైమింగ్ ని, డిఫరెంట్ గోదారి యాసతో 'వాల్తేరు వీరయ్య' క్యారెక్టర్ డిజైన్ చేశారు.

గాడ్ ఫాదర్ లాంటి హిట్ తర్వాత మెగాస్టార్ చేసిన సినిమా.. రవితేజ కూడా కీ రోల్ కావడంతో హైప్ బాగా పెరిగిపోయింది. ఫ్యాన్స్ మెచ్చే అంశాలు చాలా ఉన్నాయి.

ట్రైలర్ చూపించినట్లుగా ఇంటర్నేషనల్ డ్రగ్ డీలింగ్ టాపిక్ తో సినిమా మొదలవుతుంది. వాల్తేరు వీరయ్యగా బాస్ ఎంట్రీ.. ఆ వెంటనే బాస్ పార్టీ సాంగ్ తో ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లారు.

అక్కడినుండి మెగాస్టార్ కామెడీతో పాటు అతిథి రోల్ లో హీరోయిన్ శృతిహాసన్ ఎంట్రీ.. ఆమెతో బాస్ లవ్ ట్రాక్ ఇవన్నీ చాలా సరదాగా సాగిపోతాయి.

ఫస్టాఫ్ లో ఓవైపు కామెడీ, మరోవైపు సీరియస్ నెస్ క్రియేట్ చేశారు. దానితోపాటు మెయిన్ క్యారెక్టర్స్, విలన్ ఇంట్రడక్షన్స్, అదిరిపోయే ట్విస్టు, యాక్షన్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ వరకు పట్టుకొచ్చేశారు.

ఇక సెకండాఫ్ లో.. వీరయ్య ఫ్లాష్ బ్యాక్, ఏసీపీ విక్రమ్ సాగర్ క్యారెక్టర్ లో మాస్ రాజా రవితేజ ఇంట్రడక్షన్ బాగుంది. పక్కా తెలంగాణ యాసలో రవితేజ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ కిక్కిస్తాయి.

అలా వీరయ్యకి, రవితేజకి మధ్య జరిగే సన్నివేశాలు నవ్విస్తూనే.. ఆసక్తి కలిగిస్తాయి. ఓ ఊహించని ట్విస్టు.. ఎమోషన్స్.. కంటతడి పెట్టించే సీన్స్.. ఎమోషనల్ సాంగ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి.

వీరయ్య కథలో కొత్తదనం లేదు.. రివేంజ్ యాక్షన్ డ్రామానే. కానీ.. స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్స్, సాంగ్స్.. మాస్ ఎలిమెంట్స్ తో ఎంటర్ టైన్ చేశారు.

ఇక మాస్, కామెడీ, డాన్స్ ఏదైనా బాస్ తర్వాతే అని మరోసారి ప్రూవ్ అయ్యింది. మెగాస్టార్ అన్నివిధాలా ప్రేక్షకులను, ఫ్యాన్స్ ని మెప్పించాడు.

ఇక దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఎనర్జిటిక్ గా ఉన్నాయి.. కానీ, బాస్ కి ఇంకా బెటర్ సాంగ్స్ పడాల్సింది అనిపిస్తుంది.బీట్, డాన్స్ అన్నీ ఉన్నాయి.. కానీ.. చిరు సాంగ్స్ లో సోల్ మిస్ అయ్యింది.

దర్శకుడు బాబీ చెప్పినట్లే ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునేలా వీరయ్యని ప్రెజెంట్ చేశాడు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. బాస్ ఈజ్ బ్యాక్ అనడానికి వీరయ్యని ఉదాహరణగా తీసుకోవచ్చు.

ప్లస్ పాయింట్స్: చిరంజీవి, రవితేజ యాక్షన్ సీన్స్ మ్యూజిక్ ట్విస్టులు, ఎమోషన్స్

మైనస్ పాయింట్స్: కొత్తదనం మిస్సయిన స్టోరీ

రేటింగ్: 4/5