ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది ఉదయం పూట, సాయంత్రం పూట వ్యాయమాలు చేస్తుంటారు

వయసు తేడా లేకుండా ఇటు చిన్న పిల్లల నుంచి అటు వృద్ధుల వరకు ఎక్సర్ సైజ్ లు చేస్తూ ఉంటారు.

కొందరు యోగాలు చేస్తుంటే.. మరి కొందరు జిమ్ లు, వాకింగ్ లు చేస్తుంటారు.

ఇకపోతే ఉపవాసం సమయంలో వ్యాయమం చేయడం ఎంత వరకు మంచిది? 

అసలు నిపుణులు ఏం చెబుతున్నారనే పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

మనలో చాలా మంది అప్పుడప్పుడు ఉపవాసం ఉంటుంటారు. అయితే ఆ సమయంలో వ్యాయమం చేయాలా? వద్దా అనే సందేహంలో ఉండిపోతుంటారు.

ఉపవాసం సమయంలో వ్యాయమం చేయడమే మంచిదేనని నిపుణులు తెలియజేస్తున్నారు. 

ఈ టైమ్ లో వ్యాయమం చేయడం ద్వారా  జీవక్రియ, కండరాల పెరుగులకు ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. 

వ్యాయమం చేయొచ్చు కదా అని.. చెమటలు కక్కుతూ అధిక తీవ్రత కలిగినవి కాకుండా చిన్న చిన్న వ్యాయమాలు చేయొచ్చు.

హై బీపీ, మధుమేహంతో బాధపడేవారు వ్యక్తులు ఉపవాసం సమయంలో వ్యాయమాలు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

మధుమేహంతో బాధపడేవారు తినకపోవడం వల్ల షుగర్ లెవల్స్ పెరిగిపోతుంటాయి.

దీంతో ఈ విషయంలో మధుమేహ వ్యాధి గ్రస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

ఏదైన వ్యాధితో బాధపడే వ్యక్తులు వ్యాయమం చేసే ప్రక్రియలో తలనొప్పి, అలసట వచ్చినప్పుడు ఆ సమయంలో వ్యాయమం చేయకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.