మూతిమీద మొలిసిన ప్రతి బొచ్చు మీసం కాదురా బచ్చా! నాకు సవాల్ విసరకు.. నేను శవాలు విసురుతా!
నన్ను చూడాలంటే చావుకు కూడా పర్మిషన్ కావాలిరా.. అపాయింట్ మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను.. అడ్డంగా నరుకుతా!
నా మాట పదును.. నా కత్తి పదును.. నీ పక్కోడికి తెలుసు! నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలకు కూడా తెలీదు నా కొడకల్లారా!
సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో! ఆ చరిత్ర సృష్టించిన వారి పేరు మారదు.. మార్చలేరు!
వాళ్ళు ప్రజలు కూర్చోబెట్టిన వెదవలు.. గౌరవించడం మన ధర్మం!
నిన్ను తాకాలంటే కత్తి వణుకుద్దేమో.. నేను బరిలోకి దిగితే సీమే వణుకుద్ది!
రాకరాక వచ్చిన మంత్రి పదవీ.. నా చేత అడ్డమైన ఫైల్స్ మీద సంతకాలు చేయిస్తుండారు.. రేపు ఏదైనా తేడా వచ్చిందనుకో పక్కరాష్ట్రములో ఉన్నా ఎత్తుకొచ్చి మరీ కొడతారురా!
ఆడి తల తీసుకురమ్మంటే.. తలకాయ కూర తింటవా.. పగోడి సావు కన్నా అన్నం ఎక్కువా నీకు!
పగోడు పంపుతున్న పసుపు కుంకాలతో బతుకుతాంటే.. ముత్తైదువులా లేను.. ముండమోపిలా ఉన్నా!
సిద్దప్ప.. ఎండ నడినెత్తికెక్కేలోపు కొడుకుల్ని నరికి.. ఈ మట్టికి ఎరవేసిపోదాం! రేయ్.. ఊరికి మంచి చేస్తే తలవంచుతా.. చెడు తలిస్తే ఎన్ని తలలైనా తెంచుతా!
ప్రగతి సాధించడం అభివృద్ధి.. ప్రజల్ని వేధించడం కాదు! జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. భిక్షం వేయడం కాదు! పరిశ్రమలు నిర్మించడం అభివృద్ధి.. కూల్చడం కాదు! బుద్ధి తెచ్చుకో అభివృద్ధికి అర్థం తెలుసుకో.. మినిస్టర్!
వాడు దోచుకోవడానికి వచ్చాడు నాట్ అలోడ్! పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా DNAకి పొగరెక్కువ!
శరీరంలో తప్పుచేసిన భాగాన్ని కోసేయడం నాకు అలవాటు.. తప్పు మాట్లాడితే గొంతు కోస్తా!
ఇది రాయల్ సీమ! ఇక్కడ రోడ్లపై పిచ్చి కుక్కలు కూడా నడుస్తుంటాయి! రాజును చూడు.. కుక్కను కాదు!
మినిస్టర్.. మీ పదవికి గౌరవం ఇచ్చా! మీరు పిలిస్తే వచ్చా.. ఇంకెవ్వరి మాట నాకు వినపడకూడదు!
వీరసింహారెడ్డి.. పుట్టింది పులిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్! ఊరు నీదికాదు నాదికాదు కొడకా.. రేపటిది!
సీమలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని.. నేనొక్కడ్ని కత్తి పట్టుకున్నా! పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలవారు నాకిచ్చిన బాధ్యత!
మగతనం గురించి నువ్వు మాట్లాడకు.. మొలతాళ్లు సిగ్గుపడతాయ్! ఈ గడ్డ మీద ఆడపడచు కోసం ప్రాణం ఇచ్చేవాడ్ని మగాడు అంటారు.. ఆడదాన్ని అడ్డు పెట్టుకుని బ్రతికేవాడ్ని కొ*జ్జా అంటారురా.. ముండమోపి!
నా తండ్రి చితి సాక్షిగా చెప్తున్నా.. ఈ మట్టిమీద నా నెత్తురు బొట్టు పడేలోపు నీ తల తెగిపడకపోతే నేను సీమబిడ్డనే కాదురా!