చాలామంది భోజనమైనా మానేస్తారు. కానీ రోజులో ఒక్కసారైనా టీ తాగడం మర్చిపోరు. డెడికేషన్ అలాంటిది మరి!
ఇంకొందరు ఎక్కువగా టీ, కాఫీలు తాగేస్తున్నామని అనుకుంటూ ఉంటారు. కానీ దాన్ని తగ్గించుకోలేకపోతుంటారు.
అయితే ఈ టిప్స్ పాటిస్తే మాత్రం.. టీ, కాఫీ తాగే అలవాటుని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
టీ, కాఫీకి బదులు పసుపు పాలు, యాలకుల ఫ్లేవర్ తో తయారు చేసిన బాదం మిల్క్ ని తీసుకోండి.
ఇలా చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఇతర సమస్యలు కూడా రావు.
అలానే టీ, కాఫీకి బదులు.. హోమ్ మేడ్ సూప్స్ కూడా తాగొచ్చు. తద్వారా టీకి నెమ్మదిగా దూరమవుతారు.
టీకి బాగా అలవాటుపడిన వాళ్లు.. హోమ్ మేడ్ హెర్బల్ టీ తీసుకోవడం చాలా ఉత్తమం.
టీకి బాగా అలవాటుపడిన వాళ్లు.. హోమ్ మేడ్ హెర్బల్ టీ తీసుకోవడం చాలా ఉత్తమం.
అలానే ఆర్గానిక్ తేనె, బెల్లం లాంటి వాటిని మీరు షుగర్ కు బదులుగా ఉపయోగించుకోవచ్చు.
కావాలంటే లెమన్ గ్రాస్, గ్రీన్ టీ, స్ట్రాబెర్రీ టీ లాంటి వాటిని కొనుగోలు చేసి వాడొచ్చు ఇవి టీ కంటే మంచివే!
ప్రతి రోజు ఉదయాన్నే టీ తాగే వాళ్లు.. దీనికి బదులుగా నిమ్మరసం తీసుకుంటే మంచిది.
శరీరాన్ని యాక్టివ్ గా ఉంచడంలో ఆపిల్స్ చాలా సహాయపడతాయి. టీకి బదులు దీన్ని తీసుకోవచ్చు.
ఇలా పై విధంగా టీ, కాఫీలకు బదులుగా వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది పైగా రిలీఫ్ గా ఉంటుంది.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.