నందమూరి బాలకృష్ణ అనగానే మాస్ సినిమాలే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే ఆయన మూవీస్ చేస్తుంటారు.

2021 డిసెంబరులో 'అఖండ'గా వచ్చిన బాలయ్య.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు. మాస్ జాతర ఏంటో చూపించారు.

అలాంటి బాలయ్య.. హీరోగా చేసిన సినిమా 'వీరసింహారెడ్డి'. జనవరి 12న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది.

ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ జరగ్గా.. యూబైఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇక సెన్సార్ సభ్యులు మూవీ అదిరిపోయిందని అన్నారు.

బాలయ్య అభిమాని అయిన గోపీచంద్ మలినేని.. ఈ సినిమాని ఓ దర్శకుడిగా కంటే ఫ్యాన్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు రిలీజైన 'వీరసింహారెడ్డి' ట్రైలర్, సాంగ్స్.. అందులోని బాలయ్య డ్యాన్సులు, డైలాగ్స్ చూస్తుంటే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనిపిస్తుంది.

ఇక సెన్సార్ బట్టి.. సినిమాకు పూర్తి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ కు థియేటర్లలో కూర్చున్న వారు పునకాలు పక్కా అంటున్నారు.

ఈ సినిమా చూస్తున్నంతసేపు నందమూరి ఫ్యాన్స్ అయితే ఒక్కరు కూడా సీట్లో కూర్చోరని.. ఈలలు, గోలలతో రచ్చ చేస్తారని బల్లగుద్ది చెబుతున్నారు.

ఇలా సెన్సార్ సభ్యులే బాలయ్య 'వీరసింహారెడ్డి' వేరే లెవల్ ఉందని చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ బాలయ్యకు హీరోయిన్ గా శ్రుతిహాసన్ చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ తదితరులు విలన్ గా నటించారు.

ఇక 'వీరసింహారెడ్డి' ట్రైలర్ లో చూపించినట్లు ఇది డబుల్ యాక్షన్ డ్రామా అని కూడా తెలుస్తోంది. 

ఇందులో శ్రుతిహాసన్ తోపాటు హనీరోజ్, చంద్రిక రవి లాంటి భామలున్నారు.

ఇలా ఏ యాంగిల్ లో చూసుకున్నా సరే 'వీరసింహారెడ్డి' థియేటర్లలో రచ్చ చేయడం, బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు సునామీ క్రియేట్ చేయడం గ్యారంటీ అనిపిస్తుంది.

ఇక 'వీరసింహారెడ్డి'తో పాటే సంక్రాంతి కానుకగా చిరు 'వాల్తేరు వీరయ్య', విజయ్ 'వారసుడు', అజిత్ 'తెగింపు' సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ కానున్నాయి.

సరే ఇదంతా పక్కనబెడితే.. బాలయ్య 'వీరసింహారెడ్డి' ఎలా ఉండబోతుందని మీరనుకుంటున్నారు. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు?