తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండగల్లో సంక్రాంతి ఒకటి.
ఈ పండుగ సందర్భంగా ఎక్కడెక్కడో ఉన్నవారు సొంత ఊళ్లకు చేరుకుంటారు.
ఇదే సమయంలో విద్యార్థులు సంక్రాంతి సెలవుల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు.
ఈనేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులను ప్రకటించాయి.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటించిన సంక్రాంతి సెలవులన వివరాలు ఇప్పుడు చూద్దాం.
సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం అత్యధికంగా ఏడు రోజులు సెలవులు ప్రకటించింది.
ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఐదు రోజులే సంక్రాంతి సెలవులు ప్రకటించింది.
ఏపీ ప్రభుత్వం జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది.
అనంతరం జనవరి 19న పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతాయి.
తొలుత ఏపీ ప్రభుత్వం.. జనవరి11 నుంచి 16 వరకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కానీ ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు అదనంగా ఒక రోజు సెలవు పొడిగించింది.
ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
ఇక తెలంగాణలో జనవరి 13నుంచి17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది.
తెలంగాణలో జనవరి18వ తేదీన కాలేజీలు, విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి.