ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య అనే స్లోగన్ రీసౌండింగ్ వస్తోంది.
వీర సింహారెడ్డి ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ దెెబ్బతో సినిమా ప్రేక్షకులు అంతా బాలయ్య మేనియాలో పడిపోయారు.
ఒంగోలులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య చెంఘీజ్ ఖాన్ గురించి చెప్పుకొచ్చారు.
చెంఘీజ్ ఖాన్ పై సినిమా తీయాలి అనేది నా జీవితాశయం అని చెప్పారు.
ఇప్పుడు అంతా ఎవరీ చెంఘీజ్ ఖాన్ అని వెతుకులాట మొదలు పెట్టారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మంగోలియా సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి చెంఘీజ్ ఖాన్
అతను ఈశాన్య ఆసియాలో సంకరజాతికి చెందిన వ్యక్తి.
అతని అసలు పేరు టెమూజిన్ అంట.
మంగోల్ సామ్రాజ్య విస్తరణ కోసం చెంఘీజ్ ఖాన్ ఎన్నో క్రూరమైన దండయాత్రలు చేశాడు.
శరణు కోరని రాజులను వారి సైన్యాన్ని, ఆ రాజ్యంలో ఉన్న వారిని ఊచకోత కోశేవాడు.
అక్కడి స్త్రీలను బందీలుగా తీసుకునేవాడని చెబుతారు.
చెంఘీజ్ ఖాన్ కన్నెర్రజేస్తే అతని క్రూరత్వానికి భయపడి యుద్ధానికి వెళ్లకుండా సామంతులుగా మారిపోయేవారట.
అతని సైన్యం చేసే వికృత చేష్టలను మాటల్లో వర్ణించడం కూడా కష్టమని చెబుతారు.
అయితే చెంఘీజ్ ఖాన్ సామ్రాజ్యం, దండయాత్రలపై ఎక్కడా సరైన ఆధారాలు లేవు.
ఇలాంటి వ్యక్తిపై సినిమా చేస్తానంటూ బాలయ్య చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.