నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' సినిమాతో థియేటర్లలో సందడి చేసేందు రెడీ అయిపోయారు.
తాజాగా శుక్రవారం ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు.
ఈ మొత్తం ఈవెంట్ కే ప్రత్యేకగా ఆకర్షణగా నిలిచింది మలయాళ బ్యూటీ హనీ రోజ్
కేరళలో పుట్టిన హనీ.. 14 ఏళ్ల వయస్సులోనే యాక్టర్ అయిపోయింది.
అంటే హనీ రోజ్ 2005లో నటిగా మలయాళంలో తొలి సినిమా చేసింది.
ఆ తరువాత అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది.
హానీ రోజ్ కు 2012లో రిలీజైన 'త్రివేంద్రం లాడ్జ్' అనే సినిమాతో బ్రేక్ వచ్చింది.
ఇక ఆ సినిమా తరువాత నుంచి మలయాళ సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ వచ్చింది.
మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్స్ సరసన హనీ రోజ్ నటించింది.
గతంలోనే తెలుగులో ఆలయం(2006), ఈ వర్షం సాక్షిగా (2013) అనే సినిమాల్లో చేసింది.
తాజాగా 'వీరసింహారెడ్డి' సినిమాతో మరోసారి ఈ మలయాళ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.
వీరసింహరెడ్డి సినిమాలో 'మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి' పాటలో డ్యాన్స్ తో ఆకట్టుకుంది
ఇక హనీరోజ్ బోల్డ్ పాత్రలకు కూడా కేరాఫ్ అడ్రస్.
ఇటీవల రిలీజైన 'మాన్ స్టర్' సినిమాలో మంచు లక్ష్మితో కలిసి హనీరోజ్ లిప్ లాక్ సీన్స్ చేసింది.
మరి అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న హానీరోజ్ ని చూసి మీలో ఎంతమంది ఫిదా అయ్యారు.