అమెరికన్‌ సింగర్‌ టేలర్‌ స్విఫ్ట్‌ గురించి మీకు తెలిసే ఉంటుంది.

ఈమెకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

టేలర్‌ సోషల్‌ మీడియా ఖాతా అయిన ఇన్‌స్టాగ్రామ్‌కు 239 మిలియన్ల ఫాలోయర్స్‌ ఉన్నారు.

ఈమె తరుచుగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన పెంపుడు పిల్లి ఒలివియా బెన్‌సన్‌కు సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటారు.

దీంతో ఫ్యాన్స్‌ పెద్ద సంఖ్యలో వాటిని చూడటమే కాకుండా లైక్‌ చేయటం షేర్‌ చేయటం చేస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే బెన్‌సన్‌కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది.

కేవలం దాని ఫొటోలు, వీడియోలు చూడటానికి జనం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు.

అలా దాని ఫొటోలకు వచ్చిన వ్యూస్‌ను బట్టి అది కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.

ఇప్పుడు దాని ఆస్తి విలువు 800 కోట్ల రూపాయలు.

ప్రపంచంలో అత్యధిక ఆస్తి కలిగిన జంతువుల్లో ఇది మూడోది.

మొదటి స్థానంలో ఓ జర్మన్‌ షెపర్డ్‌ కుక్క ఉంది. దాని​ ఆస్తి విలువ 3వేల కోట్లకు పైమాటే..