మాస్ మహారాజా రవితేజ.. చాన్నాళ్ల తర్వాత బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించాడు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నాడు.
గతేడాది 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలతో నిరాశపరిచిన రవితేజ.. 'ధమాకా'తో హిట్ కొట్టేశాడు.
మరీ ముఖ్యంగా అసలు ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో పెద్ద కథేం ఉండదు. చాలా తెలుగు సినిమాల్లో చూసిన స్టోరీనే దాదాపు కనిపిస్తుంది.
కానీ రవితేజ మార్క్ ఎనర్జీ, శ్రీలీల యాక్టింగ్ తో పాటు అద్భుతమైన డ్యాన్స్.. ఫ్యాన్స్, ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
అలానే కామెడీ పార్ట్ కూడా బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది. థియేటర్లకు వెళ్లి వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది!
డిసెంబరు 23న 'ధమాకా'తో పాటు రిలీజైన '18 పేజెస్' మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇది కూడా రవితేజ సినిమాకు చాలా ప్లస్ అయిందనే చెప్పాలి.
ఈ సినిమా రిలీజ్ తర్వాత నుంచి సంక్రాంతి వరకు మరో పెద్ద సినిమా లేదు. దీంతో మూవీ లవర్స్.. 'ధమాకా'ని ప్రిఫర్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తొలిరోజు నుంచి వసూళ్ల పరంగా 'ధమాకా'.. స్టడీగా ఉంటూ వచ్చింది. అలా రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి.
'ధమాకా' సినిమా తాజాగా.. వరల్డ్ వైడ్ రూ.100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసినట్లు మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది.
దీంతో రవితేజ పనైపోయింది, 'ధమాకా' ఆడదని ఫిక్స్ అయిన చాలామంది.. ఇప్పుడు వసూళ్లు చూసి ఆశ్చర్యపోతున్నారు.
రవితేజ 'ధమాకా' సినిమాతో మాస్ కమ్ బ్యాక్ ఇచ్చాడని ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లో రవితేజ కూడా పోలీస్ కమిషనర్ గా నటించాడు.
సంక్రాంతికి ఇది రిలీజ్ కానుంది కాబట్టి.. దీనికి కూడా కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయనిపిస్తుంది.
ఒకవేళ ఇది జరిగితే మాత్రం వారాల వ్యవధిలో రూ.100 కోట్ల మార్క్ క్రాస్ చేసిన హీరోగా రవితేజ రికార్డ్ సాధిస్తాడు!