సాధారణంగా పిల్లలు భూమి మీద పాకడం అలవాటు పడినప్పటి నుంచే.. కింద ఉన్న పదార్థాలను నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు.

అలా చిన్నతనం నుంచే అలవాటు కావడంతో కొందరి పిల్లల్లో అది మట్టి తినడానికి దారి తీస్తుంది.

పల్లెటూర్లలో అయితే పిల్లలు మట్టితినడం అనే అలవాటు సర్వసాధారణంగా ఉంటుంది. 

ఎందుకంటే ఊర్లలో ఎక్కువగా మట్టి ఇల్లులే ఉంటాయి కాబట్టి.

పిల్లలు మట్టితినే అలవాటును మాన్పించడం తల్లిదండ్రులకు చాలా కష్టమైన పని, దాంతో వారు తెగ ఆందోళన పడుతుంటారు.

అయితే ఈ అలవాటును మాన్పించడానికి కొన్ని చిట్కాలను చిన్నపిల్లల నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు పిల్లలు మట్టి తినడానికి గల కారణాలను ముందుగా తెలుసుకోవాలి. 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పిల్లల్లో ఐరన్, కాల్షియం లోపం కారణంగానే మట్టి తినడానికి ఇష్టపడతారని చెబుతున్నారు.

ఇలా మట్టి తినడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలా కాకుండా ఉండాలి అంటే.. ఈ క్రింది చిట్కాలు పాటించాలి.

పిల్లలకు అరటి పండ్లను తినిపించాలి. ఎందుకంటే వీటిల్లో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి కాల్షియం లోపాన్ని జయించవచ్చు.

కాల్షియం లోపం కారణంగానే పిల్లలు మట్టిని ఇష్టపడతారు. 

అందుకే అరటి పండులో తెనేను కలిపి సైతం తినిపించొచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక పిల్లలు మట్టి తినే అలవాటు మానాలి అంటే.. 6-7 లవంగాలను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని చల్లార్చి పిల్లలకు పట్టించండి.

ఈ చిట్కాలు పాటిస్తే.. మీ పిల్లలు మట్టితినే అలవాటు త్వరగా మానేస్తారు.

నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటింటే ముందు మీ దగ్గర్లో ఉన్న డాక్టర్ సూచనలు, సలహాలు పాటించండి.