సాధారణంగా ప్రకృతిలో లభించే ఆహారపదార్థాల వల్ల అనేక లాభాలు కలుగుతాయి

కానీ మనకు వాటి గురించి తెలియక, తెలుసుకోక వాటిని తక్కువ చేసి చూస్తాం.

భారతీయ ఆయుర్వేదంలో దాదాపు సర్వరోగ నివారిణిగా చెప్పుకునేది బూడిద గుమ్మడికాయ. 

అన్ని రోగాలకు ఇది మెడిసిన్ గా పని చేస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.

చాలా మందికి  బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకునే ఓ దిష్టి గుమ్మడికాయగానే చూస్తారు. కానీ దీనిలో ఎన్నో ఔషధాలు దాగున్నాయి.

బూడిద గుమ్మడి కాయ పొట్టును అలాగే గింజలను కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. 

అనంతరం ఆ నూనెను జుట్టుకు రాసుకుంటే.. వెంట్రుకలు రాలడం తగ్గటంతో పాటు మృదువుగా తయ్యారు అవుతాయి.

ఈ గింజలను పొడి చేసి పాలల్లో కలిపి తీసుకోవడంతో పోట్టలో ఉండే నులి పురుగులు నశిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇక బూడిద గుమ్మడి కాయ జ్యూస్ ను రోజూ పరిగడుపున తాగడం వల్ల అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇందులో ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్ లు రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి.

బూడిద గుమ్మడికాయ జ్యూస్ ను తాగడం వల్ల మగవారిలో మానసిక ఒత్తడి తగ్గుతుంది.

ఈ జ్యూస్ లో ఉండే ఔషధాల వల్ల హార్ట్ ఎటాక్, మూత్రపిండాల సమస్యలు, జీర్ణ సమస్యలను దరికి చేరకుండా చేస్తుంది.

ముఖ్యంగా మగవారిలో అనేక లైంగిక సమస్యలకు బూడిద గుమ్మడికాయ చక్కని పరిష్కారం చూపిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన చిట్కాలను పాటించే ముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహాలను పాటించండి.