తళతళ మెరిసే దంతాలు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ సరిగా పళ్లు తోమరు.
దీంతో కొందరి దంతాలపై మచ్చలు ఏర్పడుతుంటాయి.
దీని వల్ల ఇతర దంత సమస్యలు కూడా వస్తుంటాయి.
ముఖ్యంగా చాలామంది దంతాలపై తెల్ల మచ్చలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి.
ముత్యాళ్లాంటి దంతాలపై తెల్లని మచ్చలు దంతాల అందాన్ని మొత్తం దెబ్బతీస్తాయి.
చాలా మంది దీనిని కేవలం సౌందర్య సమస్యగానే భావిస్తారు.
నిజానికి ఇవి దంత క్షయానికి కూడా కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ మచ్చలను ఖచ్చితంగా వదిలించుకోవాలి.
దంతాలపై ఈ మచ్చలు దంతాలు కుళ్ళిపోవడాన్ని సూచిస్తాయి. అసలు తెల్లని మచ్చలని ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
నోరు ఎప్పుడూ తడిగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పొడిగా ఉంటే.. నోట్లో Phని ఈక్వెల్ గా ఉంచడానికి తగినంత లాలాజలం ఉత్పత్తి కాదు.
దీనివల్ల పీహెచ్ స్థాయి సరిగా ఉండదు. నోట్లో సూక్ష్మ జీవులు బాగా పెరిగిపోతాయి. ఇవి మీ దంతాలపై దాడిచేస్తాయి. అలా కూడా తెల్లని మచ్చలు ఏర్పడతాయి.
షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలను మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. కేకులు, నిమ్మకాయ, వెనిగర్ తో చేసిన ఫుడ్స్ లోనూ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల దంతాలపై తెల్లని మచ్చలు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బాడీ క్లీనింగ్ ఎంత ముఖ్యమో.. నోరు క్లీనింగ్ కూడా అంతే ముఖ్యం. నోటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే మీ దంతాలపై ఫలకం ఏర్పడుతుంది.
ఫలకంలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఇది పిండి పదార్థాలు తిన్న వెంటనే దంతాలపై పేరుకుపోతుంది. దీనివల్ల సూక్ష్మజీవులు తెల్లని మచ్చలని ఏర్పరుస్తాయి.
దంతాలను గట్టిగా ఉంచే ఖనిజాల్లో ఫ్లోరైడ్ ఒకటి. ఇది ఎక్కువైనా సరే దంతాలపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. అలాగే దంత కుహరాల సమస్య తలెత్తుతుంది.
ఫ్లోరోసిస్ వల్ల దంతాలు కొద్దిగా రంగు మారినట్టుగా కనిపిస్తాయి. అంటే పసుపు రంగు, దంతాల రంగు మారుతుంది.
ఎనామెల్ మైక్రోఅబ్రేషన్, టీత్ వైటెనింగ్ లేదా బ్లీచింగ్, టీత్ వెనీర్, టోపికల్ ఫ్లోరైడ్, కాంపోసిట్ రెసిన్.. దంత సమస్యలకు నివారణలు మార్గాలు.
ఫ్లోరైడ్ లేని నీటిని ఉపయోగించండి, టూత్ పేస్ట్, బ్రష్ పై తక్కువగా పెట్టుకోవడం, షుగర్, యాసిడిటీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ తాగడం తగ్గించడం దీని నివారణకు చిట్కాలు.
అలానే మచ్చలు పోగొట్టే టిప్స్ పాటించడమే కాదు మీ నోటిని కూడా క్లీన్ గా ఉంచుకోవాలి. ఇలా చేస్తే గనుక ముత్యాల్లాంటి దంతాలు మీ సొంతం అవుతాయి.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.