ప్రస్తుతం సుమిత్రా సేన్ వయసు 89 ఏళ్ళు. కాగా, జనవరి 3న తెల్లవారుజామున ఆమె కన్నుమూశారు.
వయసు పైబడటంతో సుమిత్రా సేన్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని సమాచారం.
బెంగాలీ చిత్రపరిశ్రమలో ఆమె దాదాపు నాలుగు దశాబ్దాలపాటు గాయనిగా సేవలందించారు
సుమిత్రా సేన్ మరణవార్తను ఆమె కుమార్తె శ్రబాని సేన్ (ప్రఖ్యాత రవీంద్ర సంగీత్ ఆర్టిస్ట్) ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా తెలిపారు.
ఇటీవలే సుమిత్రా సేన్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా.. ఆమె బ్రోంకోప్ న్యుమోనియా బారిన పడ్డారని వైద్యులు తెలిపారు
ఇక సేన్ మృతి పట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు.
2012లో సుమిత్రా సేన్ ని బెంగాల్ ప్రభుత్వం ‘సంగీత మహాసమ్మన్’ అవార్డుతో సత్కరించింది.
ఆమెకు కుమార్తెలు ఇంద్రాణి, శ్రబాని సేన్ ఉన్నారు
సుమిత్రా సేన్ పాటలలో మేఘ్ బోలేచే జబో జాబో, తోమారీ జర్నతలర్ నిర్జోనే, సఖీ భాబోనా కహరే బోలే, అచ్ఛే దుఖో అచే మృత్యు లాంటి ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి.