ఆరోగ్యాన్ని అందించే సిరిధాన్యాల్లో రాగులకు మొదటి స్థానం ఉంటుంది. 

రాగి పిండితో ఏ వంటకాలు చేసి తిన్నాసరే పోషకాలు సమృద్ధిగా అందుతాయి.

రాగి జావ, రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి రొట్టెలు చాలా రుచిగా ఉంటాయి. 

రాగిరొట్టెలు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

రాగులు.. ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫైబర్, అమైనో ఆమ్లం నిండిన గొప్ప మూలం. బరువు తగ్గించడం నుంచి షుగర్ పేషెంట్స్ ఎన్నో ప్రయోజనాలు అందిస్తున్నాయి.

రాగుల్లో పీచు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర తృణధాన్యాలలో కంటే రాగిలో లైసిన్, థ్రెయోనిన్, వాలైన్‌లను కలిగి ఉంటుంది.

రాగుల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్నప్పటికీ ఇందులో పాలి అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

రోజువారిగా తీసుకునే అన్నం కన్నా రాగిరొట్టెల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. 

ఫైబర్, మినరల్స్, అమినో యాసిడ్ ఎక్కువగా ఉన్నందున షుగర్ ఉన్నవాళ్లకు మేలు చేస్తాయి.

రాగిరొట్టెలు తినటం వల్ల దీనిలో గ్లూటెన్ ఉండదు. చక్కెర పదార్థం తక్కువగా ఉంటుంది.

రాగిరొట్టెలు తినటం వల్ల దీనిలో గ్లూటెన్ ఉండదు. చక్కెర పదార్థం తక్కువగా ఉంటుంది.

ఫలితంగా ఇది ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించవచ్చు. చెడు కొలెస్ట్రాల్ ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

రాగి రొట్టె తయారీకి రాగి పిండి కప్పు, మునగాకు అరకప్పు, వెల్లుల్లి రెండు రెబ్బలు, పచ్చిమిర్చి రెండు , ఉల్లిపాయ ఒకటి, కరివేపాకు రెబ్బ, నువ్వులు 2 టీస్పూన్లు, ఉప్పు సరిపడా, నీళ్లు తగినన్ని తీసుకోవాలి.

ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని అందులో మునగాకు, పచ్చి మిర్చి, తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు, తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి.

ప్లాస్టిక్ కవర్‌పై నూనె రాసి ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ముద్దల్లా చేసుకో వాటిని వత్తుతూ రొట్టెల్లా చేసుకోవాలి.

స్టవ్ పై పెనం పెట్టి కొద్దిగా నూనె వేసుకుంటూ రొట్టెలు కాల్చాలి. దీంతో ఎంతో రుచికరమైన రాగి రొట్టెలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల పొట్ట నిండుతుంది కానీ బరువు మాత్రం పెరగం!

నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.