తన స్వస్థలం ఉత్తరాఖంఢ్ నుంచి ఢిల్లీకి వస్తుండగా శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది.
హమ్మద్‌పూర్ ఝల్ సమీపంలోని రూర్కీలోని నర్సన్ సరిహద్దులో.. పంత్ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు, డివైడర్‌ను ఢీకొట్టింది.
దాంతో కారులో మంటలు చెలరేగాయి. వెంటనే పంత్ కారు విండో పగలగొట్టుకుని బయటకు దూకాడు.
ఈ ప్రమాదంలో పంత్ వీపు కాలిపోగా.. మోకాలు, తలకు గాయాలయ్యాయి.
కారు డివైడర్‌ను గుద్దుకోగానే మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు.
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రిషబ్ పంత్.. పాల్గొన్నాడు.
త్వరలో జరగబోయే శ్రీలంక టీ20 సిరీస్‌కు పంత్‌ను ఎంపిక చేయలేదు.
క్రిస్టమస్ వేడుకల కోసం పంత్.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనితో కలిసి దుబాయ్ వెళ్లాడు.
ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.