మారుతున్న కాలానికి అనుగుణంగా చిన్న వయసులోనే చాలా మంది హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు.

అధిక బరువుతో కూడా చాలా మంది బాధపడుతుంటారు. వీటన్నిటికీ సరైన పరిష్కారం వ్యాయమం.

ఆరోగ్యంగా ఉండాలంటే అందరు వ్యాయమం చేయడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అందరూ రోజూ వ్యాయమం చేస్తున్నారు.

అయితే వ్యాయమం చేసే వారు మాత్రం ఖచ్చితంగా ఈ సూచనలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

వ్యాయమం చేసే ముందు, చేసిన తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనే విషయంపై చాలా మందికి క్లారిటీ ఉండదు.

వ్యాయమం ముగిసిన తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనే విషయంపై నిపుణులు ఈ విధమైన సూచనలు చేస్తున్నారు

వ్యాయమం చేసే సమయంలో మనం స్ట్రెస్ కు లోని కాకుండా ఉండాలంటే రోజూ ఒక గుడ్డు లేదా అరటి పండు తీసుకోవాలి. 

వ్యాయమం పూర్తైన తర్వాత ఆహారంలో ఖచ్చితంగా నాన్ వేజ్, గుడ్లు, చేపలు ఉండే విధంగా చూసుకోవాలి.

వ్యాయమం చేసిన తర్వాత అందరూ మాంసం తీసుకోవాలని కూడా ఏం లేదు.

వ్యాయమం ముగిసిన తర్వాత మాంసం తెనలేని వాళ్లు ప్రోటిన్ కలిగిన ఎలాంటి ఆహర పదార్థాలైన తీసుకోవచ్చు.

ఇలా వ్యాయమం ముగిసిన తర్వాత ప్రొటిన్లు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అవగాహన కోసం వైద్యులను, నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.