మన వంటింట్లో చాలా మసాలా దినుసులు ఉంటాయి. వాటితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అజీర్తి, బరువు తగ్గడం, దగ్గు, జలుబు వరకు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ని.. మన ఇంట్లో దొరికే వాటితోనే నయం చేయొచ్చు.
చాలామంది ఆడవాళ్లు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు వంటింటి చిట్కాలనే ఉపయోగిస్తుంటారు.
ఉదయాన్నే వాము వాటర్ తాగమని పెద్దలు చెప్తుంటారు.
పదేపదే పొట్ట సమస్యలు, అజీర్తితో బాధపడేవారికి వాము నీళ్లు బాగా ఉపయోగపడతాయి.
జుట్టు, బరువు తగ్గడం, పిసిఒఎస్ సమస్యలను కూడా వాము నీరు తగ్గిస్తుంది. దీన్ని చాలామంది పచ్చిగానే తింటుంటారు.
ఆహారంలో కూడా ఎక్కువగా కలుపుతుంటారు. కచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే.. మీకు వాము నీరు అద్భుతంగా పనిచేస్తుంది.
అలాగే ఉదయం పరిగడుపున ఒక గ్లాసు వాము నీటిని తాగితే ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు.అవేంటంటే..
ఒకటి రెండు రోజుల్లో బరువు తగ్గడం చాలా చాలా కష్టం. కానీ రెగ్యులర్ గా పరగడుపున వాము వాటర్ తాగితే మాత్రం కచ్చితంగా బరువు తగ్గుతారు.
జీవక్రియను వేగవంతం చేయడంలో వాము వాటర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే అజీర్తిని నివారించడానికి సహాయపడుతుంది.
ఈ విధంగా మెటబాలిక్ యాక్టివిటీని పెంచడం వల్ల మలబద్ధకం, ఊబకాయం లాంటి సమస్యలు తగ్గిపోతాయి.
బొబ్బలు, దురద, తామరతో బాధపడుతుంటే వాము తీసుకుని గోరువెచ్చని నీటితో పేస్ట్ చేసి ఆ ప్లేస్ లో పెట్టండి. అవి త్వరగా తగ్గిపోతాయి.
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారికి వాము వాటర్ చాలా మంచిది. కడుపు నొప్పి లేదా తిమ్మిరిని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
పరుగడుపున వాము వాటర్ తాగినప్పుడు మీ గట్ లోని ఎంజైమ్స్ సక్రమంగా పనిచేస్తాయి. దీంతో జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. గ్యాస్ సమస్య పోతుంది.
వాము నీరు ఆస్తమా రోగులకు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఇది శ్వాస సులువుగా తీసుకోవడానికి సహాయపడుతుంది.
వాము నీరు తాగడం వల్ల ఊపిరితిత్తులు, స్వరపేటిక శుభ్రంగా మారతాయి. ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.