చలికాలంలో పిల్లలలు చిన్నచిన్న అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.
ఇలాంటి సమస్యల నుంచి పిల్లలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు చాలా జాగత్రలు తీసుకుంటారు.
చలికాలంలో పిల్లలకు కొన్ని రకాల సూప్ లు పెడితే.. జలుబు, ఇతర ఇన్ఫెక్షన్స్ రావు.
పిల్లల ఎదుగుదలకు అవసరమైన.. మినరల్స్, విటమిన్స్, కాల్షియం, ప్రొటీన్లు వంటి పోషకాలు.. సూప్‌లో ఉంటాయి.
శీతాకాలం మీ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే.. రెండు సూప్‌లు ఇప్పుడు తెలుసుకుందాం..
చలికాలంలో పిల్లలు కొన్ని రకాల అనారోగ్య సమస్యలను నుంచి కాపాడే వాటిల్లో వెజిటేరియన్ సూప్ ఒకటి.
పాలకూరను సన్నగా తరిగి పెట్టుకోవాలి. తరువాత పాన్‌లో వెన్న వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి.
అందులో పాలకూర తరుగు, ఉప్పు, మిరియాల పొడి వేసి మూత పెట్టాలి.
కొద్ది సమయం తరువాత అందులో జీలకర్ర పొడి యాడ్ చేయాలి.
రెండు నిమిషాలకి అందులోని బిర్యానీ ఆకును తీసేసి పక్కన పెట్టాలి.
అది చల్లారిన తర్వాత బ్లెండర్లో వేసి పేస్లా చేసుకోవాలి.
అందులో మరో టీస్పూను మిరియాల పొడి, పావు కప్పు నీళ్లు కలిపి పాన్ లో పోసి వేడి చేయాలి.
ఒక పొంగు వచ్చే వరకూ ఉంచి ఆ తరువాత ఆఫ్ చేయాలి.
ఇది కొంచెం చల్లారిన తర్వాత.. మీ పిల్లలకు పెడితే.. తెగ ఎంజాయ్ చేస్తూ తాగుతారు.
ఇదే విధంగా చికెన్ సూప్ కూడా తయారు చేస్తే.. మీ పిల్లలు ఆస్వాదిస్తూ తాగుతారు.
జలుబు, దగ్గు, కఫం, జ్వరం వంటి అనారోగ్యంతో నుంచి పిల్లలను ఈ సూప్ కాపాడుతుంది.
ఏది ఏమైనా ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.