అప్పుడప్పుడు గొంతులో కఫం చేరుతూ ఉంటుంది.
దీని వల్ల గొంతు గర గర, తీవ్ర అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.
ఈ కఫం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే అది దగ్గుకు దారితీస్తుంది. అందుకే వీలైనంత త్వరగా కఫాన్ని నివారించుకోవాలి.
మరి కఫాన్ని ఎలా తగ్గించుకోవాలి.అందు కోసం ఏం ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గొంతులో కఫానికి చెక్ పెట్టడంలో ఉల్లిపాయ అద్భుతంగా సమాయపడుతుంది. ఓ ఉల్లిపాయని మెత్తగా గ్రైండ్ చేసి రసం తీసుకోవాలి.
గొంతులో కఫానికి చెక్ పెట్టడంలో ఉల్లిపాయ అద్భుతంగా సమాయపడుతుంది.
ఓ ఉల్లిపాయని మెత్తగా గ్రైండ్ చేసి రసం తీసుకోవాలి.
అందులో తేనే మిక్స్ చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిలో ఉండే సల్ఫర్ ఇట్టే కఫాన్ని నివారిస్తుంది.
పుదీనాతో కూడా గొంతులో ఏర్పడిన కఫాన్ని తగ్గించుకోవచ్చు. గ్లాస్ వాటర్‌లో కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా మరిగించి వడబోసుకోవాలి.
ఇప్పుడు ఈ నీటిలో కొద్దిగా నిమ్మ రసం కలిపి సేవిస్తే కఫం క్రమంగా తగ్గిపోతుంది.
ఒక గిన్నెలో కొన్ని మెంతులు, నాలుగైదు లవంగాలు వేసి లైట్‌గా వేయించాలి. కాటన్ క్లాత్‌లో వీటిని చుట్టి గొంతు, మెడపై మెల్ల మెల్లగా అద్దుకోవాలి.
ఇలా చేసినా కఫం కరిగిపోతుంది. ఇక వీటితో పాటు తరచూ ఆవిరి పడుతూ ఉండాలి. ఆవిరి పట్టడం ద్వారా కఫం తగ్గి గొంతు క్లీన్ అవుతుంది.
కఫం ఏర్పడినప్పుడు పాలు, ఇతర పాల ఉత్పత్తులు, ఆయిల్ ఫుడ్స్, బాగా ఫ్రై చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు వంటి వాటికి దూరంగా ఉండాలి.
లేదంటే కఫం మరింత ఎక్కువ అవుతుంది. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. మద్యం సేవించడం, స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.