అలానే నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే తులసి ఆకులను నమలడం వల్ల మంచిదంట.
రోగనిరోధక శక్తిని పెంచడంలో తులసి బాగా ఉపయోగపడుతుంది.
కానీ కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తులసి కారణమవుతుందంట.
తులసి ఆకులు తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి అన్న విషయం చాలా మందికి తెలియదు.
తులసి ఆకుల్లో పాదరసం ఉండడంవల్ల నమిలినప్పుడు అందులో ఉండే మూలకాలు బయటకు వస్తాయి.
తులసి ఆకుల్లో ఆమ్లం దంతాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి.
ఎన్సిబిఐ నివేదిక ప్రకారం తులసి ఆకుల్లో సంతానోత్పత్తి నిరోధక లక్షణాలు కలిగి ఉన్నాయట.
ఒకవేళ తులసి ఆకులు ఎక్కువగా తింటే అది స్పెర్మ్ కౌంట్ ను ప్రభావితం చేస్తుంది.
తులసి ఆకుల్లో రక్తం గడ్డ కట్టే సమస్య ఉందని నిపుణులు అంటున్నారు.
రక్తం గడ్డ కట్టే సమస్య లేకుంటే బ్లడ్ తిన్నర్స్ తీసుకునేవారు తులసి ఆకులను ఎక్కువగా తీసుకోకూడదు.
వీటిని తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయని కూడా అధ్యయనాలు వెల్లడించాయి.
డయాబెటిక్ మందులు వేసుకుని తీసుకుంటే శరీరంలో చక్కెర శాతం అధికంగా తగ్గి హానికరమంట.
గమనిక: ఇది కేవలం అంతర్జాలం నుండి సేకరించింది మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.