మిగతా సందర్భాల్లో ఎలా ఉన్నా పర్లేదు కానీ.. గర్భవతి అయ్యాక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

నడిక.. మొదలు కూర్చునే వరకు.. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

గర్భం ధరించాక.. వారిని కింద కూర్చోకూడదు అంటారు. వీలైనంత వరకు ఎత్తులోనే అంటే.. చైర్‌, బెడ్‌ మీద కూర్చోవాలి అంటారు.

ఈ క్రమంలో చాలామంది గర్భవతులను ఒక సందేహం వేధిస్తూ ఉంటుంది.

అదేంటంటే ప్రెగ్నెన్సీ సమయంలో బాసింపట్టు వేసుకుని కూర్చోవచ్చా లేదా అని అనుమానం కలుగుతుంది.

దీనికి వైద్యులు ఏం సమాధానం చెబుతున్నారంటే.. గర్భం దాల్చిన తర్వాత బాసింపట్టు వేసుకుని కూర్చోవచ్చు.

కాకపోతే.. దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

మరీ ముఖ్యంగా బాసింపట్టు వేసుకున్నప్పుడు గర్భాశయం మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి.

ఒకవేళ బాసింపట్టు వేసుకుని కూర్చుంటో.. ఏమైనా ఒత్తిడి అనిపిస్తే కూర్చోకూడదు.

అలానే గతంలోబాసింపట్టు వేసుకుని కూర్చునే అలవాటు లేని వాళ్ళు గర్భం దాల్చిన తర్వాత దీన్ని ప్రయత్నించవద్దు అంటున్నారు వైద్యులు.

బాసింపట్టు వేసుకుని కూర్చుంటే.. నడుము కింది భాగంలోని ఎముకలకు బలం చేకూరుతుంది.

అలానే రెండు కాళ్ళు ఒకదాని మీద విశ్రాంతి తీసుకుంటూ నడుము కింద భాగం మీద బరువు పడుతుంది.. కనుక ఇంది ఎంతో మేలు చేస్తుంది.

కానీ ముందే చెప్పినట్టు గర్భాశయం మీద ఒత్తిడి పడనంత వరకు మాత్రమే ఘిలా కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి.

మరోక విషయం ఏంటంటే నడుము నొప్పితో బాధపడే వాళ్లు.. ప్రెగ్నెన్సీ సమయంలోబాసింపట్లు వేసుకుని కూర్చోకూడదు.

కాబట్టి మీ శరీర తత్వాన్ని, అది రియాక్టయ్యే తీరుని బట్టి మీరు బాసింపట్టు వేసుకుని కూర్చోవాలి అంటున్నారు నిపుణులు.

గమనిక: ఇది కేవలం అంతర్జాలం నుండి సేకరించింది మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.