మనిషి నీరు తాగడం అనేది చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం కాలంలో నీరు కూడా కలుషితమవుతుంది. 

స్వచ్చమైన నీరు తాగడం ద్వారా ఆరోగ్యంతో పాటు అందంగా కూడా ఉంటుంది.

ఈ రోజుల్లో చాలా మంది స్కిన్ గ్లోగా ఉంచుకునేందుకు రక రకాల డిటాక్స్ వాటర్ తాగుతూ ఉంటారు. 

ఇలాంటి డిటాక్స్ వాటర్ తాగడం ద్వారా ఆరోగ్యంతో పాటు స్కిన్ కూడా గ్లో అవుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. 

అసలు డిటాక్స్ వాటర్ అంటే ఏమిటి? ఎలా తయారు చేసుకుని తాగాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏదైన మనకు ఇష్టమైన పండును కట్ చేసి ఓ గ్లాసులో వేసుకోవాలి. ఆ తర్వాత ఆ గ్లాసులో మనం తాగేంత నీరు పోసి రాత్రంత నానబెట్టాలి. 

ఇక నానబెట్టిన ఉదయం వరకు డిటాక్స్ వాటర్ గా మారతాయి. ఇలా తయారు చేసుకున్న నీటినే డిటాక్స్ వాటర్ అంటారు.

ఇలా తయారు చేసుకుని రోజూ తాగడం ద్వారా ఆరోగ్యంతో పాటు స్కిన్ లో గ్లో పెరిగే అవకాశం ఉంటుంది.

దోసకాయ డిటాక్స్ వాటర్ లో విటమిన్ సీ, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ దోసకాయ డిటాక్స్ వాటర్ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

పైనాపిల్ లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, సోడియం, యాంటి యాక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్న ఈ డిటాక్స్ వాటర్ తాగడం ద్వారా కడుపు ఉబ్బరం, గ్యాస్, ఏసీడీటీ నుంచి విముక్తి పొందొచ్చు.

విటమిన్ సీ, మాంగనీస్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉన్న స్ట్రాబెరీ డిటాక్స్ వాటర్ తాగడం వల్ల అనేక అంటువ్యాధుల నుంచి బయటపడడంతో పాటు ఆరోగ్యం కూడా వరిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు

ఒక పాన్ లో కొద్దిగా నీరు పోసుకుని కొద్దిసేపు మరిగించాలి. 

ఆ మరిగించిన నీటిలో రెండు చిటికెల పసుపుతో పాటు కొద్దిగా నూనే వేసి కలపాలి.

అనంతరం ఆ నీటిని వడబోసి తాగాలి. ఆ పసుపు నీటిని తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

సోంపు వాటర్ ను కూడా రోజూ తీసుకోవడం ద్వారా జీర్ణ సంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇలా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ డిటాక్స్ వాటర్ రోజూ తాగి ఆరోగ్యం ఉండండి.

గమనిక: ఇది కేవలం అంతర్జాలం నుండి సేకరించింది మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.