ఎన్ని సినిమాలొచ్చినా సరే లవ్ స్టోరీస్ కి ఉండే క్రేజ్ వేరు. కరెక్ట్ గా తీయాలే గానీ ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేయడంలో ఇవి ముందుంటాయి.

ఇక సుకుమార్.. లవ్ స్టోరీస్ రాయడంలో, తీయడంలో చాలా ఎక్స్ పెర్ట్. ఆయన రాసిన కథతో నిఖిల్-అనుపమ జంటగా నటించిన సినిమా '18 పేజెస్'.

'కార్తికేయ 2'తో రూ.100 కోట్ల మార్క్ ని అందుకున్న నిఖిల్.. ఇప్పుడు '18 పేజెస్'తో థియేటర్లలోకి వచ్చాడు. మరి రివ్యూ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

కథ: సిద్ధార్థ్ (నిఖిల్) యాప్ డెవలపర్. చాటింగ్ పేరుతో ఓ అమ్మాయి మోసం చేయడంతో.. మందు కొడుతూ రోడ్డుపై తిరుగుతూ ఉంటాడు. అలాంటి టైంలో ఓ డైరీ దొరుకుతుంది.

డైరీ రాసిన నందిని(అనుపమ పరమేశ్వరన్)తో ప్రేమలో పడతాడు. చదవడం పూర్తయ్యాక ఆమెని కలుద్దామని ఊరికి వెళ్తాడు. అక్కడ ఆమె ఉండదు.

హైదరాబాద్ కు తిరిగొచ్చిన సిద్దార్థ్ కు నందిని గురించి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అది ఏంటి? చివరకు ఏమైందనేది తెలియాలంటే థియేటర్ లో మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ: '18 పేజెస్' పోస్టర్, ట్రైలర్ చూడగానే మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. కానీ సినిమా చూసిన తర్వాత మీరు సర్ ప్రైజ్ అవుతారు.

ఇక డైరీ చదివి, అది రాసిన అమ్మాయిల్ని ప్రేమిస్తారా.. ఈ కాలంలోనూ అలాంటి వాళ్లు ఉన్నారా అని మనకు డౌట్ వస్తుంది.

ఈ సినిమా చూస్తున్నంతసేపు హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను ఫీల్ అవుతూనే.. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టెన్షన్ కూడా ఫీలవుతాం.

'18 పేజెస్' స్టోరీలో ట్విస్టులు, లవ్ ఫీల్ తో పాటు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగానే సెట్ అయ్యాయి. సినిమా ఓవరాల్ గా ప్రెజెంట్ చేసిన తీరు బాగుంటుంది.

నటీనటుల పనితీరు: హీరోహీరోయిన్ నిఖిల్-అనుపమ.. ఈ సినిమాలో చాలా కొత్తగా, అదే టైంలో అందంగా కనిపిస్తారు. 'కార్తికేయ 2'లో నిఖిల్, ఇందులో నిఖిల్ అస్సలు పోలికుండదు.

సోషల్ మీడియాకు దూరంగా ఉండే అమ్మాయి పాత్రలో అనుపమ అందంగా కనిపించింది. అలా మనమూ ఉంటే బాగుండు అనిపించేలా చేసింది. మిగిలిన వాళ్లు కూడా బాగానే చేశారు.

ఈ సినిమాకు సుకుమార్ పేరు చూసి వెళ్లేవాళ్లు చాలామంది. ఆయన రాసిన స్టోరీ, దాన్ని పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్ చేసిన విధానం బాగుంది.

ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి ట్విస్టులు జోడించడం కూడా ఫెర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది.

మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్, సినిమాటోగ్రఫర్.. సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్లడంలో కీ రోల్ ప్లే చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియాకు బాగా అడిక్ట్ అయిపోయిన యూత్ కి ఈ సినిమా మంచి మెసేజ్ ఇస్తుంది. అదే టైంలో మంచి అనుభూతి కూడా కలిగిస్తుంది.

ప్లస్ పాయింట్స్: నిఖిల్-అనుపమ యాక్టింగ్, లవ్ స్టోరీలో ట్విస్టులు, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: కొన్ని ప్రిడిక్టబుల్ సీన్స్, అక్కడక్కడా లాజిక్స్ మిస్

రేటింగ్: 2.5 / 5

గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగతం అభిప్రాయం మాత్రమే