సినిమాల్లో రావాలంటే బ్యాక్ గ్రౌండ్ గట్టిగా ఉండాలని ఒకప్పుడు బలంగా నమ్మేవారు. అలాంటి టైంలో ఇండస్ట్రీలోకి వచ్చాడు రవితేజ.
సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకుని స్టార్ హీరో రేంజ్ కి వెళ్లిపోయాడు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు.
అలా రవితేజ హీరోగా నటించిన 'ధమాకా' తాజాగా థియేటర్లలోకి వచ్చింది. రివ్యూ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: స్వామి(రవితేజ) ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుర్రాడు. ఉద్యోగం పోగొట్టుకుని ఆవారాగా తిరుగుతూ ఉంటాడు.
తన చెల్లి ఫ్రెండ్ ప్రణవి(శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. అదే టైంలో ప్రణవిని ప్రముఖ కంపెనీ సీఈఓ చక్రవర్తికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు.
అప్పటికే స్వామిని ఇష్టపడిన ప్రణవి.. చక్రవర్తిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదే టైంలో స్వామి, చక్రవర్తి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి.
అసలు వీళ్లిద్దరూ ఎవరు? ప్రణవి ఎవరిని పెళ్లి చేసుకుంది? చివరకు ఏమైంది తెలియాలంటే థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: స్టోరీ ఏదైనా సరే రవితేజ అందులో ఉన్నాడంటే.. కచ్చితంగా సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తాడు.
కానీ రవితేజ చేసిన గత రెండు సినిమాలు 'ఖిలాడీ', 'రామారావు ఆన్ డ్యూటీ'.. బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచాయి. ఇలాంటి టైంలో 'ధమాకా' వచ్చింది.
మాస్ కమర్షియల్ జానర్ లో వచ్చన రొటీన్ మూవీ 'ధమాకా'. కథకథానాల పరంగా ఏ మాత్రం కొత్తగా లేదు. రవితేజ మాత్రం ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించారు.
డ్యూయల్ రోల్ లో రవితేజ క్యారెక్టర్స్ ఎంటర్ టైనింగ్ గానే రాసుకున్నారు. కానీ సినిమాను సాగదీశారు. ట్విస్టులు కూడా ఊహించేయొచ్చు.
ఓవరాల్ గా చెప్పుకుంటే ఎన్నో కమర్షియల్ మిక్స్ చేసి తీసిన 'ధమాకా'లా అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తుంటే చాలా సినిమాలు మనకు గుర్తొస్తాయి.
నటీనటులు పనితీరు: స్వామి, ఆనంద్ చక్రవర్తి క్యారెక్టర్స్ కు రవితేజ పూర్తి న్యాయం చేశాడు. శ్రీలీల కూడా అందంగా కనిపించింది.
మిగిలిన క్యారెక్టర్స్ చేసిన అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఉన్నంతలో రావు రమేశ్-హైపర్ ఆది బాగా నవ్వించారు.
టెక్నీషియన్స్ పనితీరు: ఈ సినిమా మేజర్ ప్లస్ పాయింట్స్ అంటే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ టాప్ లో ఉంటాయి. కార్తీక్, భీమ్స్ అదరగొట్టారు.
టెక్నీషియన్స్ పనితీరు: ఈ సినిమా మేజర్ ప్లస్ పాయింట్స్ అంటే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ టాప్ లో ఉంటాయి. కార్తీక్, భీమ్స్ అదరగొట్టారు.
గత సినిమాల స్థాయిలో రైటర్ ప్రసన్న కుమార.. తన మ్యాజిక్ ని ఈ సినిమాలో చూపించలేకపోయారు.
డైరెక్టర్ త్రినాధరావు నక్కిన చెప్పినట్లు సినిమాలో సీట్లలో నుంచి ఎగిరిపడే బలమైన సీన్స్ ఏం లేవు. ప్రమోషన్స్ కోసం చెప్పినట్లు అనిపించింది.
ప్లస్ పాయింట్స్: రవితేజ ఎనర్జీ, మూడు సాంగ్స్
మైసస్ పాయింట్స్: రొటీన్ స్టోరీ, ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే, అనవసరమైన సీన్స్
రేటింగ్: 1.5 / 5
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే