క్రిస్మస్ వచ్చిందంటే చాలు.. పిల్లలు ఫుల్ హ్యాపీ అయిపోతారు. శాంటా క్లాస్ తాత వచ్చి గిఫ్ట్స్ ఇస్తారని ఆనందంగా ఎదురుచూస్తారు.
మరి ఎన్నో శతాబ్దాల నుంచి బాగా పాపులారిటీ దక్కించుకున్న ఈ శాంటా తాత ఎవరు? ఆయన స్టోరీ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
శాంటా క్లాస్ ప్రస్తావన రాగానే ఎర్ర బట్టలు, తెల్ల గడ్డం, ప్రశాంతమైన ముఖంతో ఉన్న వ్యక్తి, భుజాన బహుమతుల మూటతో గుర్తుకొస్తారు.
అలా గుర్తురాగానే మనకు హ్యాపీ స్మైల్ వస్తుంది. చిన్న పిల్లలతో పాటూ పెద్దవాళ్లు కూడా శాంటా క్లాస్ అంటే ఎంతో ఇష్ట పడతారు.
క్రీస్తు శకం 280లో సెయింట్ నికోలస్ అనే ఒక మాంక్ ఉండేవారు. ఆయన ప్రస్తుతం టర్కీ గా పిలిచే మైరా అనే ప్రదేశంలో జన్మించారని చెబుతారు.
ఈయన తన ధనాన్నంతా పేదలకు పంచి పెట్టేసి డబ్బులేని వారికీ, ఆరోగ్యం సరిగా లేని వారికీ సాయం చేస్తూ ఉండేవారు.
ఒకసారి ఓ తండ్రి తన ముగ్గురి కూతుళ్లకు పెళ్ళి చేయడానికి డబ్బులేక అమ్మేస్తుంటే సెయింట్ నికోలస్ అడ్డుపడ్డాడనీ, వారి వివాహానికి కావాల్సిన ధన సహాయం చేశాడనీ చెబుతారు.
నెమ్మదిగా సెయింట్ నికొలేస్ చిన్న పిల్లలు, నావికులకు ఫేవరెట్ గా మారిపోయారు. సెయింట్ నికోలస్ ఐరోపాలో బాగా పాపులర్ సెయింట్ గా పేరు తెచ్చుకున్నారు.
సెయింట్ నికోలస్, సింట్ నికోలస్, సింటర్ క్లాస్, శాంటా క్లాస్ అంతా ఒకరే కానీ శాంటా క్లాస్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉండిపోయింది.
19వ శతాబ్దం మొదటి నుంచి క్రిస్మస్ టైంలో పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడం ఆచారంగా మారింది.
షాపింగ్ మాల్స్, స్టోర్స్ లో శాంటా క్లాస్ లాగా డ్రెస్ వేసుకున్నవారిని ఉంచి పిల్లలు, తల్లిదండ్రులనీ ఎట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు.
1822లో క్లెమెంట్ క్లార్క్ మూర్ అనే కవి 'యాన్ అకౌంట్ ఆఫ్ ఏ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్' అనే పద్యం రాశారు.
ఇది "ఇట్ వజ్ ద నైట్ బిఫోర్ క్రిస్మస్" అనే పేరుతో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం శాంటా క్లాజ్ ఎలా ఉంటాడని అనుకుంటున్నామో అలా వర్ణించింది ఈయనే.
ఎనిమిది రెయిన్ డీర్లు లాగుతున్న ఒక స్లే మీద ఎక్కి ఒక ఇంటి నుండి ఒక ఇంటికి ఎగురుతూ వెళ్లి ఆ ఇంట్లో పిల్లలకి బహుమతులు ఇస్తాడని పద్యంలో ఆయన వర్ణించాడు.
1881లో థామస్ నాస్ట్ అనే పొలిటికల్ కార్టూనిస్ట్ ప్రస్తుత శాంటా క్లాజ్ ఫొటోని తొలిసారి తెరపైకి తీసుకువచ్చారు.
తెల్లని గడ్డంతో బొద్దుగా నవ్వుతూ, మంచి పిల్లల కోసం బహుముతల మూటని భుజాన వేసుకుని వచ్చే రూపాన్ని ఇక్కడే మొదటిసారిగా చూస్తాం.
తెల్లని ఫర్ తో ట్రిమ్ చేసిన ఎర్రని బట్టలూ, నార్త్ పోల్ లో శాంటా క్లాజ్ వర్క్ షాప్, ఎల్వ్స్, శాంటా క్లాజ్ భార్య మిసెస్ క్లాజ్.. ఇవన్నీ నాస్ట్ తీసుకు వచ్చినవే.
నోట్: పైన చెప్పినదంతా మాకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారం రాశాం. నెటిజన్స్ గమనించగలరు.