ఈ రోజుల్లో చాలా మంది ముఖ సౌందర్యానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నారు.

ఆడవాళ్లే కాకుండా మగాళ్లు సైతం చూడడానికి అందరిలో అందంగా కనిపించాలని ఆ దిశగా అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. 

దీని కోసం మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల క్రిమ్ లను వాడుతూ చివరికి ఏరికోరి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

ఇకపోతే చాలా మంది కంటి కింద ఉండే నలుపు మచ్చలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.

ఆ కంటి కింద నలుపును పొగొట్టేందుకు మార్కెట్ లో దొరికి క్రిమ్ లను వాడుతుంటారు. 

అయినా వారికి ఫలితం కనిపించకపోవడంతో విసిగిపోతుంటారు.

అయితే ఇలా కళ్ళ కింద పేరుకుపోయిన నల్ల మచ్చలు పోవాలంటే చింతపండుతో ఇలా చేయాలి.

సిట్రిక్ యాసిడ్ గుణాలు కలిగి ఉన్న చింతపండు ఆరోగ్య పరంగానే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా బాగా పని చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

సిట్రిక్ యాసిడ్ గుణాలు కలిగి ఉన్న చింతపండు ఆరోగ్య పరంగానే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా బాగా పని చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇలాంటి  కంటికింద ఉండే నల్ల మచ్చలు పోవాలంటే చింతపండుతో ఎలా చేయాలి? 

ముఖానికి ఎలా రాసుకోవాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చింతపండు, పాలు మిక్సిలో వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. అలా పేస్ట్ లా తయారు చేసుకున్న చింతపండు మిశ్రమాన్ని కంటికింద ఉండే మచ్చలకు రాసుకోవాలి. 

 కొద్దిసేపటి తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే కంటి కింద ఉండే నల్ల మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి.

ముఖంపై మచ్చలు, ముడతలు ఉన్న వారు సైతం ఇలా వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలుస్తోంది.

మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించే ముందు మీ దగ్గర్లో ఉన్న డాక్టర్లను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోండి.