ఎండకాలంలో ప్రతి ఇంట్లో పెరుగు తప్పకుండా ఉంటుంది. అందులోనూ మూడు పూటలా పెరుగుతో తినేవాళ్లు కూడా ఉన్నారు.
పెరుగు మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. వడదెబ్బ కొట్టకుండా కాపాడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని కాల్షియం మన ఎముకల్ని బలంగా ఉంచుతుంది.
పెరుగును తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇక చలికాలం విషయానికొస్తే.. ఈ సీజన్ లో పెరుగును తినే వారు చాలా అంటే చాలా తక్కువనే చెప్పాలి.
పెరుగును తినడం వల్ల మన బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. దీంతో మరింత చలి పెడుతుందని చాలా మంది అనుకుంటారు. ఈ సీజన్ లో పెరుగు తింటే జలుబు చేస్తుందని భావిస్తారు.
కొందరు ఈ సీజన్ లో దగ్గు, జలుబు సమస్యలతో బాధపడుతున్నా.. పెరుగును తినాలనుకుంటారు. పెద్దలు మాత్రం ఇలా అస్సలు తినకూడదని చెప్తుంటారు. మరి నిపుణులు ఏమంటున్నారు?
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గ్రంధుల నుంచి స్రావాల రావడంలో పెరుగు సహాయపడుతుంది
శ్లేష్మ స్రావాన్ని కూడా బాగా పెంచుతుంది. ఇది మీ శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
పెరుగు కఫ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అధిక శ్లేష్మం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఉబ్బసం, జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఎక్కువవుతాయి
చలికాలంలో రాత్రి పెరుగు తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది.
చలికాలంలో జలుబు, దగ్గుతో బాధపడుతుంటే పాల ఉత్పత్తులను మొత్తమే తీసుకోకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పాల ఉత్పత్తులు శ్లేష్మం ఉత్పత్తి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
పాలు కూడా కఫానికి కారణమవుతాయి. ఇక మీకు అప్పటికే కఫం ఉంటే అది గట్టిపడటానికి దారితీస్తుంది. ఇది గొంతులో మరింత చికాకుని పెంచుతుంది.
వాస్తవానికి పెరుగులోని కొన్ని లక్షణాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం పెరుగులో ప్రోబయోటిక్స్, జింక్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
నిపుణుల చెప్పిన దాని ప్రకారం.. ఏ ఆహారాన్ని అయినా సరే మితంగా తీసుకోవాలి. అప్పుడే దాని నుంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. పెరుగు విషయంలో కూడా అంతే.
చలికాలంలోనూ పెరుగును ఎంచక్కా తినొచ్చు. కాని మరీ చల్లగా ఉండే పెరుగును తినకూడదు. చలికాలంలో చల్లని ఉష్ణోగ్రత కలిగిన ఆహారాలను తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయి.
ఎందుకంటే వాటిని శరీర ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి శరీరం రెండు రెట్లు కష్టపడాల్సి ఉంటుంది. చలికాలంలో పెరుగు ప్రయోజనాలను పొందడానికి ఒక గొప్ప మార్గం పెరుగు అయిన వెంటనే తినడం.
గది ఉష్ణోగ్రత టైంలోనే పెరుగుని తినేయాలి లేదంటే వెచ్చని వంటకాలతో కలిపి తీసుకోవచ్చు. మీ జలుబు, దగ్గు మరింత ఎక్కువ కాకుండా ఉండటానికి పెరుగు అన్నం, దహి కబాబ్ తయారు చేసుకుని తినొచ్చు.
భోజనం తర్వాత పెరుగు కానీ, పెరుగు ఆధారిత వంటకాలను గాని అసలే తినకూడదు. చలికాలంలో పెరుగుని మధ్యాహ్నం పూట తినడమే మంచిది. కానీ ఎక్కువగా తినకూడదు. కప్పు పెరుగుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోండి.