మన ఇంట్లోకి అనుకోకుండా కొన్నిసార్లు పక్షులు, కీటకాలు వస్తూ ఉంటాయి. వాటి వల్ల మనకు కొన్నిసార్లు శుభం జరుగుతుంది.

అయితే ఏ పక్షులు మన ఇంట్లోకి రానివ్వొచ్చు, వేటిని రానివ్వకూడద అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పిచుకలు మన ఇంట్లోకి ప్రవేశిస్తే చాలా మంచి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ఇవి రావడాన్ని శుభసూచకంగా భావించాలి.

పిచుకలు ఇంట్లోకి వస్తే లక్ష్మీ ప్రదం. లక్ష్మీ కటాక్షం మరింత పెరగనుందని అర్థం. రెండు పిచుకలు ఇంట్లోకి వస్తే పెళ్లి జరగబోతుంది, లేదా పిల్లలు పుట్టబోతున్నారని అర్థం.

కొందరు కాకిని అశుభంగా భావిస్తుంటారు. కానీ అది పితృదేవతలకు ప్రతీకగా భావించాలి. కాకి ఎగురుతూ ఇంట్లోకి వస్తే చాలా మంచిది.

బయటకు వెళ్లినప్పుడు కాకి తల మీద తంతే ఏదో ప్రమాదం లేదా చెడు జరగబోతుందని అర్థం.

గూడ్లగూబని చూస్తే చాలామంది భయపడిపోతుంటారు. కానీ ఇది ఇంట్లోకి వస్తే చాలా మంచిది. త్వరలో లక్ష్మీదేవి రాబోతుందని అర్థం.

పాము వస్తే మీ ఇంట్లోని వ్యక్తులకు మానసిక వ్యధ ఎక్కువవుతుంది. ఏదో అశాంతి రాబోతుందని అర్థం.

కొండ మిడతలు, కందిరీగ లాంటి ఇంట్లోకి వస్తే చాలా శుభప్రదమని చెప్పొచ్చు. కందిరీగలు ఇంట్లో గూడు కడితే చాలా మంచిది. ఇది లక్ష్మీ కటాక్షానికి సంకేతం.

కందిరీగలు కట్టిన గూడు మట్టితో బొట్టు పెట్టుకుంటే మంచి జరుగుతుందని, నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయట.

బల్లులు లేని ఇల్లే ఉండదు. ఇవి ఇంట్లో ఉంటే శుభసూచకం. శాస్త్రీయంగానూ ఇవి ఇంట్లో ఉండటం వల్ల కొన్ని క్రీములని చంపి తింటాయి.

వర్షాకాలంలో కనిపించే కంటి మిడతలు.. ఇంట్లోకి రావడం శుభానికి సంకేతం.

సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే.. ఇల్లు పూలవనంలా ఆహ్లాదంగా మారిపోతుంది. ఇంట్లోని వారికి బాధలు తగ్గిపోతాయి.

సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే లక్ష్మీప్రదం. అంటే డబ్బు ఒక్కటే కాదు సంతోషం, సంతానం, మనశాంతి, కరువు లేకపోవడం లాంటివి జరుగుతాయి.

తేలు, జెర్రీ ఇంట్లోకి రవడం మంచి విషయం కానే కాదు. ఇల్లు శుభ్రంగా లేనప్పుడు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఇవి వస్తాయి. వీటి వల్ల చెడు ఎక్కువగా జరుగుతుంది.

తేలు, జెర్రీ ఇంట్లోకి రవడం మంచి విషయం కానే కాదు. ఇల్లు శుభ్రంగా లేనప్పుడు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఇవి వస్తాయి. వీటి వల్ల చెడు ఎక్కువగా జరుగుతుంది.

నోట్: పైన చెప్పినవన్నీ కూడా సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ఉన్న అంశాల ఆధారంగా రాశాం. గమనించగలరు