కొన్ని రోజుల నుంచి చలి బాగా పెరిగిపోయింది. దీంతో చాలామంది జలుబు, ఫ్లూతో బాధపడుతున్నారు.

తామర, జట్టు రాలడం, చర్మం పొడిబారడం, ఆర్థరైటిస్ సమస్యలు కూడా చాలామందిని వేధిస్తుంటాయి.

ఇక ఈ సీజన్ లోని చల్లని గాలి, వాయు కాలుష్యం వల్ల మన రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. దీంతో అనారోగ్యం బారిన పడతాం.

అయితే సీజన్ కి అనుగుణంగా ఆహారాన్ని తినడం వల్ల మనం హెల్త్ కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

శీతాకాలంలో కొన్ని ఫుడ్స్ తింటే వెచ్చగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

మరి ఈ కాలంలో ఆడవాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎప్పుడు తినాలి అనే విషయాలో తెలుసా?

చాలామంది నెయ్యి అంటే ఇష్టం ఉంటుంది. కానీ తినే సాహసం మాత్రం చేయరు. బరువు పెంచేస్తుందేమోనని భయం.

నిజానికి నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతారనేది ఓ రూమర్ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.

ఆవుపాలతో చేసిన నెయ్యిని చలికాలంలో తీసుకుంటే.. మీకు చలిని తట్టుకునే శక్తి లభిస్తుందట.

ఊసిరికాయలు కూడా ఆడవాళ్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చలికాలంలో పరగడుపున దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా సీజనల్ వ్యాధులు దరిచేరవు.

చలికాలంలో పల్లి పట్టీని ఎక్కువగా తింటుంటారు. ఇది మిమ్మల్ని అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది.

అలానే వేరుశనగ చిక్కీని తినడం వల్ల మీకు ఫుడ్ తినాలనే కోరిక తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచడానికి సహాయపడుతుంది.

మీ ఇమ్యూనిటీ పవర్ ని పెంచే మరో ఫుడ్ పంజీరి. ఇది జలుబు, దగ్గు నుంంచి కాపాడుతుంది. దీన్ని నెయ్యి, సత్తుతో చేసిన లడ్డూల రూపంలో తీసుకోవచ్చు.

ఇక పంజీరి అనే ఫుడ్ ని పాకిస్థాన్, పంజాబ్ లో ఎక్కువగా తింటూ ఉంటారు. గోధుమపిండిలో నెయ్యి, పంచదార కలిపి దీనిని తయారు చేస్తారు.

చలికాలంలో బెల్లాన్ని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

బెల్లం వల్ల మన శరీరంలో వేడి పెరుగుతుంది. తద్వారా మనకు ఈ సీజన్ లో వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

శీతాకాలంలో దొరికే పసుపు వేర్లని.. ఈ సీజన్ లో మీ ఆహారంలో చేర్చుకోండి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

నోట్: పైన టిప్స్ పాటించే ముందు డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.