శరీరానికి పౌష్టికాహారంతో పాటు వ్యాయామం కూడా అవసరమే. అయితే వ్యాయామం అందరికీ సాధ్యం కాదు కాబట్టి వాకింగ్ కి ప్రాధాన్యత ఇస్తారు.

అయితే ఈ వాకింగ్ ని ఎలా పడితే అలా కాకుండా కొన్ని పద్ధతులు అవలంబిస్తే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

రోజుకి కనీసం ఒక గంట పాటు వాకింగ్ చేయాలి. ఒకేసారి గంట సేపు చేయలేని వాళ్ళు ఉదయం అరగంట, సాయంత్రం అరగంట వాకింగ్ చేయాలి.

వాకింగ్ ని మొదట నెమ్మదిగా ప్రారంభించి.. ఆ తర్వాత వేగం పెంచాలి. ప్రారంభంలోనే వేగం పెంచకూడదు.

వాకింగ్ చేసే ముందు సౌకర్యంగా ఉండే షూస్ ధరించాలి. దీని వల్ల ఎక్కువ సేపు వాకింగ్ చేయచ్చు. అలసట తగ్గుతుంది.

వాకింగ్ చేసేటప్పుడు చేతులను వదులుగా ఉంచాలి. వెనక్కి, ముందుకి ఆడిస్తూ నడవాలి. 

దీని వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ఎక్కువ వ్యాయామం జరుగుతుంది.

వాకింగ్ ప్రారంభించే ముందు మంచి నీరు తాగాలి. 

ఎందుకంటే నీరు తాగకుండా వాకింగ్ చేస్తే డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది.

అంతేకాదు నీరు తాగడం వల్ల ఆయాసం రాకుండా ఎక్కువ సేపు వాకింగ్ చేయవచ్చు.

వాతావరణం వేడిగా ఉంటే కాటన్ దుస్తులను, చల్లగా ఉంటే ఉన్ని దుస్తులను ధరించి వాకింగ్ చేయాలి.

వాకింగ్ చేస్తున్నప్పుడు ఆయాసం వస్తే కనుక.. విశ్రాంతి తీసుకోవాలి. కొంచెం సేపయ్యాక మళ్ళీ వాకింగ్ చేయవచ్చు.

గుండె జబ్బులు ఉన్నవారు వాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 

విశ్రాంతి తీసుకుంటూ వాకింగ్ చేయాలి. ఎమర్జన్సీ ఫోన్ నంబర్లను దగ్గర ఉంచుకోవాలి.

ఇలా రోజూ వాకింగ్ చేస్తే గుండె వేగంగా కొట్టుకుంటుంది. చెమట పట్టడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ సమాచారం కేవలం అంతర్జాలం నుండి సేకరించింది మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.