పల్లెటూళ్లలో రోడ్ల పక్కన, ఇంటి పరిసరాల్లో, పొలాల దగ్గర ఎక్కువగా గడ్డి చామంతి మొక్కలు ఉంటాయి

పిచ్చి చామంతి మొక్క అని, పలకాకు మొక్క అని, గాయపాకు మొక్క అని పిలుస్తుంటారు.

ఈ గడ్డి చామంతి మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను ఇది నివారిస్తుంది.

మొలల కారణంగా అయ్యే రక్తస్రావాణ్ని ఆపడానికి గడ్డి చామంతి మొక్క బాగా ఉపయోగపడుతుంది.

గుప్పెడు గడ్డి చామంతి మొక్కల ఆకులను తీసుకుని కడిగి ఆరబెట్టాలి.

ఆ తర్వాత ఎండిన ఆకులను రోట్లో వేసి మెత్తగా నూరాలి. 10 తోక మిరియాలను కూడా వేసి మెత్తగా నూరాలి.

మెత్తగా నూరగా వచ్చిన ముద్దని ఉసిరికాయ పరిమాణంలో తీసుకుని రోజూ ఉదయం పరగడుపున తినాలి.

ముద్దని తిన్న తర్వాత పలుచని మజ్జిగలో.. పటిక బెల్లం కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల మొలల నుండి రక్తం కారడం ఆగుతుంది.

అంతేకాదు మొలల వల్ల కలిగే నొప్పి, దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

గడ్డి చామంతి మొక్కలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. గాయాలపై ఈ మొక్క ఆకుల రసాన్ని రాయడం వల్ల రక్తస్రావం తగ్గుతుంది. గాయాలు కూడా త్వరగా మానుతాయి.

ఈ గడ్డి చామంతి ఆకుల రసాన్ని చర్మంపై రాసుకోవడం వల్ల అనేక చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

ఈ గడ్డి చామంతి మొక్క ఆకులకు నీళ్లలో ఉండే ఫ్లోరైడ్ శాతాన్ని తగ్గించే శక్తి ఉందని పరిశోధనల్లో తేలింది.

తెల్ల జుట్టు నల్లగా మెరవాలంటే ఈ గడ్డి చామంతి ఆకులు బాగా ఉపయోగపడతాయి. ఒక గిన్నెలో గడ్డి చామంతి మొక్క ఆకుల రసాన్ని, నువ్వుల నూనెను తీసుకుని స్టవ్ మీద మరిగించాలి

నూనెలా తయారయ్యేవరకూ మరిగించి.. ఆ తర్వాత దాన్ని ఒక చల్లార్చి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి.

నిల్వ చేసిన నూనెను తగిన మోతాదులో తీసుకుని గోరు వెచ్చగా మరిగించి.. జుట్టుకు పట్టించాలి.

రాత్రి నిద్రపోయే ముందు జుట్టుకి నూనె రాసి. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతుంది.

డయాబెటిస్ సహా అనేక ఇతర అనారోగ్య సమస్యలను నియంత్రించే శక్తి గడ్డి చామంతి మొక్కకు ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ చిట్కాని పాటించే ముందు నిపుణులు సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.