మనం ఏదో ఒక పనిలో ఉండి నిద్రపోకుండా అలానే వర్క్ చేసేప్పుడు తెగ ఆవలింతలు వస్తాయి
మనకు ఆవలింతలు వస్తే.. పక్కన వాళ్లకు కూడా వచ్చేస్తాయి.
అయితే మీరు గమనించారో లేదో.. ఆవలిస్తున్నప్పుడు కళ్లలో నీళ్లు వస్తాయి..
అసలా అలా ఎందుకు వస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..?
మరి ఇలా నీళ్లు రావడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మన కనుబొమ్మల దిగువన లాక్రిమల్ గ్రంథులు కన్నీళ్లకు రావడానికి కారణమవుతాయట.
కళ్లు పొడి బారకుండా, తేమవంతంగా ఉండేందు గ్రంధులు నెమ్మదిగా నీటిని ఉత్పత్తి చేస్తుంటాయి.
అయితే ఆవలించినప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీరు గ్రంధుల నుంచి విడుదలై కళ్లల్లో చేరుతుంది.
మీరు ఆవలించినప్పుడు మీ ముఖ కండరాలు సంకోచి కన్నీటి గ్రంధులపై ఒత్తిడి పడుతుంది.
ఇలా ఒత్తిడి వల్ల గ్రంధులను పిండినట్టు అవడటంతో ఎక్కువ నీరు కళ్లల్లోకి చేరుకుంటాయి.
ఒక వ్యక్తి జీవితకాలంలో రెండు లక్షల 40 వేల సార్లు ఆవలిస్తాడని అంచనా.
మనం బాగా అలసిపోయినప్పుడు మెదడలోని ఉష్ణోగ్రత పెరుగుతుంది.
మెదడు తీవ్ర అలసటలో ఉన్నప్పుడు మనం చల్లటి గాలిని కోరుకుంటాం.
చల్లటి గాలిని పీల్చినప్పుడు మెదడు చల్లబడి...ఉత్తేజాన్ని పొందేందుకు ప్రయత్నిస్తుంది.
ఆవలింతలు మనుషలే కాదు, జంతువులు కూడా ఆవిలిస్తాయి.